ఈ జంతువులతో నిపా వైరస్ సోకుతుంది..ఆ జంతువులు ఏంటో చూడండి మందు లేదు..అందరికి తెలియచేయండి       2018-05-24   00:33:39  IST  Raghu V

కేరళ తో పాటు చుట్టుపక్కల ఉండే రాష్ట్రాలను వణికిస్తున్న నిపా వైరస్ గురించి చాలా భయలున్నాయి. అయితే ఈ నిపా వైరస్ గాలి ద్వారా సోకదు. అప్పటికే వైరస్ సోకిన జంతువు లేదా మనిషితో డైరెక్ట్ కాంటాక్ట్ ద్వారా మాత్రమే ఈ వైరస్ వ్యాపిస్తుంది. ఈ వైరస్ నివారణ కు ఇంకా ఏ మందులు లేవు.అయితే కొన్ని చేయడం ద్వారా నిపా వైరస్ సోకకుండా తీసుకోవాలిసిన జాగ్రత్తలు

ఇంటెన్సివ్ సపోర్టివ్ కేర్ చికిత్స

అయితే ఈ వైరస్ ను సమర్థంగా చంపగలిగేది ఇంటెన్సివ్ సపోర్టివ్ కేర్ చికిత్స ఒక్కటే.. ఈ వైరస్ భారిన పడకుండా ఉండాలంటే వైరస్ ఉన్న ప్రాంతాల్లో పందులు , గబ్బిలాలు లేకుండా చూసుకోవాలి.నిపా వైరస్ సోకిన వారిని ట్రీట్ చేసినపుడు లేదా కలిసినప్పుడు మాస్క్, గ్లోవ్స్ తొడుక్కోవాలి.

పందులు , గబ్బిలాలకు దూరంగా ఉండాలి

అనారోగ్యంతో ఉన్న పందులు , గబ్బిలాలకు దూరంగా ఉండటం, పక్వానికి రాని ఖార్జుర రసాన్ని తగకుండా ఉండటం ద్వారా ఈ వైరస్ భారిన పడకుండా ఉండవచ్చు.ఈ వైరస్ సోకిన వారిలో జ్వరం , తలనొప్పి , మత్తుగా కనిపించడం, శ్వాస సరిగ్గా ఆడకపోవటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.ఇలాంటి లక్షణాలు కనిపించిన 24 నుండి 30 గంటల్లో భాదితులు కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది.

జునొసీస్

ఇక ఈ వైరస్ గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ కొత్తగా వెలుగులోకి వచ్చిన ‘జునొసీస్’ అనే జంతువు నుండి మనుషులకు వ్యాపించే వైరస్ గా గుర్తించారు. ‘ ఫ్రూట్ బ్యాట్స్’ అనే ఒక రకం గబ్బిలాలు నిపా వైరస్ కు వాహకలు గా పని చేస్తాయని గుర్తించారు.

ముందు జాగ్రత్తే మందు

నిపా వైరస్ నివరణకు మందులు లేవని , ప్రాథమిక దశలోనే గుర్తిస్తే ప్రత్యేక చికిత్సలో నివారియించవచ్చని వైద్యులు చెపుతున్నారు.ప్రతి ఒక్కళ్ళు చేతులని శరీరాన్ని సుబ్రన్గా ఉంచుకోవాలి.బయట కొన్న పండ్లు కూరగాయలు శుభ్రం చేసుకుని తినాలి. మామిడి పండ్లు , రోజ్ ఆపిల్స్ , జాక్ ఫ్రూట్స్ లను గబ్బిలాలు ఎక్కువగా ఆహారంగా ఎక్కువగా తీసుకుంటాయట , వీటిని తీసుకున్నప్పుడు జాగ్రత్తలు పాటించాలి..

నిపా వైరస్ గురించి ఇంకొంత సమాచారం

ఇక ఇండియన్ జర్నల్ ఆఫ్ వైరలాజి విశ్లేషణ ప్రకారం నిపా వైరస్ మనుషులు , పశువులకు గాలి లేదా లాలాజలం ద్వారా సోకె జునోటిక్ దీన్ని భారత్ లో మొదటగా కేరళలో కనుగొన్నారు.అంతే కాకుండా పందులు , గబ్బిలాలు తిని వదిలిపెట్టిన పదార్థాల్లో ఇది సంక్రమిస్తుంది శాస్త్రవేత్తలు చెబుతున్నారు.దీన్ని మొదటగా సుంగయ్ నిపా గ్రామంలో 1998 లో తొలిసారిగా గుర్తించారు, తరువాత సింగపూర్ కు వ్యాపించింది…