ఈ కుర్ర హీరోయిన్ కి డైరెక్టర్స్ అంటే లెక్క లేకుండాపోయింది     2017-09-14   00:12:56  IST  Raghu V

-

-

ఎంత ఎత్తుకి ఎదిగినా పనికి గౌరవం ఇవ్వాలి. వందకి పైగా సినిమాలు చేసిన బాలకృష్ణకి ఏం అవసరం, సెట్లోకి కనీసం పదిపదిహేను నిమిషాల ముందే రావడానికే. ఆలిండియా నెం 1 డైరెక్టర్ రాజమౌళికి ఏం అవసరం సెట్లోకి ఉదయాన్నే, అసిస్టెంట్ డైరెక్టర్స్ కన్నా ముందే వచ్చేయానికి, వంద కోట్ల మార్కెట్, మిలియన్ల కొద్ది అభిమానులు ఉన్న మహేష్ బాబుకి ఏం అవసరం రాత్రుళ్ళు నిద్రలేకుండా పనిచేయడానికి. ఎంత ఎదిగినా ఇంతలా కష్టపడుతూ, తమ వృత్తి పట్ల బాధ్యతగా ఉంటారు కాబట్టే వారు ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నారు. ఇలాంటి కమిట్మెంట్ హీరోయిన్లలో ఉండదు అని కాదు, అనుష్క లాంటి వారు ఉన్న ఇండస్ట్రీ మనది. కాని చాలామంది హీరోయిన్లకు వృత్తి పట్ల గౌరవం లేకుండాపోతోంది. ఆ లిస్టులో కుర్ర హీరోయిన్ మేహ్రీన్ కూడా ఉందని అంటున్నారు ఫిలింనగర్ జనాలు.

ఈ అమ్మాయి ప్రసుతం చాలా బిజీగా ఉంది. త్వరలో విడుదల కాబోతున్న మహానుభావుడులో తనే హీరోయిన్. ఇవి కాకుండా రవితేజతో రాజా ది గ్రేట్, సాయి ధరమ్ తేజ్ తో జవాన్ సినిమాలు కూడా చేస్తోంది మేహ్రీన్. ఇక విషయానికి వస్తే, మెహ్రీన్ వలన రాజా ది గ్రేట్, జవాన్ సినిమాలకు ఎక్కడలేని సమస్యలు వచ్చిపడుతున్నాయి. రవితేజ హీరో, దిల్ రాజు నిర్మాత, అనిల్ రావిపూడి దర్శకుడు, ఇన్ని పెద్ద పేర్లు ఉన్నా పట్టించుకోకుండా, మెహ్రీన్ సెట్స్ కి ఎప్పుడూ ఆలస్యంగా వస్తోందట. అసలు సెట్ కే రాకుండా డుమ్మా కొట్టిన రోజులు కూడా ఉన్నాయట.

మరోవైపు మొన్నోసారి జవాన్ సినిమా కోసం ఒక సాంగ్ షూట్ ప్లాన్ చేస్తే, ఆ సాంగ్ షూట్ మధ్యలోనే తనకి ఇంకేదో పని ఉందంటూ వెళ్ళిపోయింది అంట. అది ఒక మాంటేజ్ సాంగ్. దాంతో బిజీ ఆర్టిస్టుల డేట్స్ వృధాపోయాయి. ఇప్పుడు అంతమంది డేట్స్ మ్యాచ్ చేసి ఆ సాంగ్ షూట్ చేయాలంటే ఎన్ని తిప్పలు పడాలి? మరి మెహ్రీన్ ఇదే పధ్ధతి కంటిన్యూ చేస్తే కష్టాలు తప్పవేమో.