ఇలా చేస్తే తెల్లబడిన జుట్టు కొద్దీ రోజుల్లోనే నల్లబడుతుంది       2018-06-03   23:49:21  IST  Lakshmi P

ఈ రోజుల్లో మారిన జీవనశైలి కారణంగా వయస్సుతో సంబంధం లేకుండా అందరిలోనూ జుట్టు తెల్లబడుతుంది. అయితే తెల్లజుట్టు వచ్చిందని ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఎందుకంటే మన ప్రాచీన ఆయుర్వేద శాస్త్రంలో తెల్ల జుట్టును నల్లగా మార్చే కొన్ని పద్ధతులు ఉన్నాయి.

ప్రతి రోజూ 2-3 సార్లు రెండు చేతుల గోళ్లను (ఐదు వేళ్ల గోళ్లను ఒకేసారి) ఐదు నిముషాల పాటు ఒక దానికొకటి రుద్దాలి. ఈ విధంగా చేస్తే జుట్టు రాలడం ఆగిపోవడమే కాకుండా తెల్లబడటమూ ఆగిపోతుంది. ఇక అప్పటి నుంచి వెంట్రుకలు ఒత్తుగా, నల్లగా మారడం ప్రారంభిస్తాయి. దీన్ని వంశ పారంపర్యంగా జట్టతల ఉన్న వేలాది మందిపై ప్రయోగించగా విజయవంతమైంది. అంతేకాక మనకు ఇంటిలో అందుబాటులో ఉండే వస్తువులతో ఒక పేస్ట్ తయారుచేసుకోవాలి. దానికి కావలసిన పదార్ధాలు, తయారి విధానం గురించి వివరంగా తెలుసుకుందాం.

జుట్టు నల్లబడడానికి కావల్సిన పదార్థాలు:
మెత్తగా రుబ్బిన గోరింటాకు- 100 గ్రాములు
కాఫీ పొడి- 3గ్రాములు
పెరుగు-25గ్రాములు
నిమ్మరసం- 4స్పూన్లు ఖదిరము(కటేచు)- 3గ్రాములు
బ్రహ్మి చూర్ణం- 10గ్రాములు
ఉసిరి చూర్ణం- 10గ్రాములు

ఈ పదార్ధాలను ఒక బౌల్ లో వేసి బాగా కలిపి తలకు పట్టించి అరగంట తర్వాత నీటితో కడిగేయాలి. ఈ విధంగా నెల రోజులు క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే జుట్టు నల్లబడుతుందని మన ఆయుర్వేద శాస్త్రం చెప్పుతుంది.