ఇదేమి దోపిడి మహేష్ బాబు?       2017-09-18   23:47:46  IST  Raghu V

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం స్పైడర్ ప్రపంచవ్యాప్తంగా ఈనెల 27వ తేదీన ఇటు తెలుగు, తమిళ భాషలతోపాటు మలయాళం మరియు అరబిక్ భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. U/A సర్టిఫికెట్ తో ఎలాంటి కట్స్ లేకుండా సినిమాని పాస్ చేసింది సెన్సార్ బోర్డు. .

ఓవర్సీస్ లో బాహుబాలి తరువాత అతిపెద్ద స్థాయిలో విడుదల కాబోతోంది స్పైడర్. ఆస్ట్రేలియాలో కొన్నిచోట్ల బాహుబలి కంటే కూడా పెద్ద రిలీజ్ స్పైడర్ కి దొరుకుతుండటం విశేషం. అంతా బాగానే ఉన్నా, ఈ సినిమా టికెట్ రేట్లు చూసి ప్రేక్షకులు నోళ్లు వెళ్లబెట్టుకుంటున్నారు. ప్రీమియర్ షోల టిక్కెట్ రేటు 25 డాలర్లు అయితే నార్మల్ షోలకి కూడా అదే రేటు పెడుతున్నారు. అంటే ఇటు ప్రీమియర్ షో చూడాలనుకునేవారు, అటు నార్మల్ షో చూడాలనుకునే వారు అందరూ కూడా $25 పైగా వెచ్చించాల్సిందే. భారతీయ కరెన్సీ ప్రకారం చెప్పాలంటే ఒక్కో టికెట్ ధర దాదాపుగా పదహారు వందల రూపాయలు. సినిమా విడుదలకి ఇంకో వారం ఉండడంతో ఈ టికెట్ రేటు ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి..

బాహుబలికి రేటు ఇంతకంటే ఎక్కువగా ఉన్నా ఆ సినిమా విషయం వేరు. మరి ఇంతలా పెంచిన టికెట్ రేటు స్పైడర్ విషయంలో వరంగా మారుతుంది లేక శాపంగా మారుతుంది చూడాలి. మరోవైపు జైలవకుశ టిక్కెట్ రేట్లు ప్రేక్షకులకి అందుబాటులో ఉన్నాయి. ప్రీమియర్ ధర 18 డాలర్లు అయితే ధర కేవలం 16 డాలర్లు.