ఇది మరీ ఓవర్‌ ప్రవీణ్‌.. ఆ కథ రాజశేఖర్‌తోనా?       2018-06-03   00:35:47  IST  Raghu V

‘చందమామ కథలు’, ‘గుంటూర్‌ టాకీస్‌’ వంటి విభిన్న చిత్రాలను తెరకెక్కించి, జాతీయ అవార్డును సైతం దక్కించుకున్న ప్రవీణ్‌ సత్తారు చాలా కాలం తర్వాత రాజశేఖర్‌కు ‘గరుడవేగ’ చిత్రంతో కమర్షియల్‌ సక్సెస్‌ను ఇచ్చాడు. ఆ సినిమా బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ను దక్కించుకున్న కారణంగా మరి కొన్నాళ్ల పాటు రాజశేఖర్‌కు తెలుగు సినిమా పరిశ్రమలో నూకలు ఉన్నాయని అంతా అనుకున్నారు. గరుడవేగ చిత్రం సక్సెస్‌ ఆయన కెరీర్‌ కొన ఊపిరికి ప్రాణం పోసినట్లయ్యింది. మరో వైపు దర్శకుడు ప్రవీణ్‌ సత్తారు కూడా ఆ చిత్రంతో మంచి క్రేజ్‌ను దక్కించుకున్నాడు.

ప్రవీణ్‌ సత్తారు సినిమా సక్సెస్‌ అవ్వడంతో ఆయనతో సినిమాలు చేసేందుకు పలువురు యంగ్‌ హీరోలు క్యూ కట్టారు. భారీ ఎత్తున రామ్‌తో ఒక సినిమాను తెరకెక్కించేందుకు ప్రవీణ్‌ సత్తారు సిద్దం అయ్యాడు. ఆ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తి చేసి, సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ను కూడా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇలాంటి సమయంలో సినిమాను క్యాన్సిల్‌ చేస్తున్నట్లుగా నిర్మాత స్రవంతి రవికిషోర్‌ ప్రకటించాడు. ప్రవీణ్‌ సత్తారు చెబుతున్న బడ్జెట్‌తో తాను సినిమాను తీయలేను అని, అంత స్థాయి రామ్‌కు లేదని, అతడిపై అంతగా ఖర్చు చేస్తే రికవరీ చేయడం కష్టం అంటూ స్రవంతి రవికిషోర్‌ తప్పుకున్నాడు.

గరుడవేగ చిత్రం తర్వాత చాలా కాలం వెయిట్‌ చేసి రాసుకున్న కథతో రామ్‌ హీరోగా సినిమా తీయాలనుకున్న ప్రవీణ్‌ సత్తారుకు చేదు అనుభవం ఎదురు అవ్వడంతో, అదే కథతో ఇప్పుడు రాజశేఖర్‌ హీరోగా సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడు. రామ్‌ హీరోగా రాజశేఖర్‌ ముఖ్య పాత్రలో ప్రవీణ్‌ సత్తారు సినిమా అనుకున్నాడు. కాని ఇప్పుడు రాజశేఖర్‌ను ప్రధాన హీరోగా మార్చేశాడు. రాజశేఖర్‌తో కూడా ఏమాత్రం తగ్గకుండా భారీ బడ్జెట్‌తో సినిమా తీస్తాను అంటూ ప్రవీణ్‌ సత్తారు అంటున్నాడు. రామ్‌తో అనుకున్న కథను రాజశేఖర్‌తో చేసేందుకు సిద్దం అవ్వడం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది.

రామ్‌తో అనుకున్న కథకు రాజశేఖర్‌ ఎలా సెట్‌ అవుతాడు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే కథలో కొద్ది పాటి మార్పులు చేసి, రాజశేఖర్‌ వయస్సుకు తగ్గట్లుగా మార్చబోతున్నట్లుగా ప్రవీణ్‌ సత్తారు చెబుతున్నాడు. గరుడవేగ చిత్రం అయితే రాజశేఖర్‌కు సెట్‌ అయ్యింది. కాని ఏ ఇతర కథు ఆయనకు సెట్‌ అవ్వక పోవచ్చు అని, ఆయన క్యారెక్టర్‌ ఆర్టిస్టుగానే కెరీర్‌ను కొసాగించడం మంచిది అంటూ కొందరు సలహా ఇస్తున్నారు. మరి ఈయన మాత్రం రాజశేఖర్‌తో భారీ సినిమాకు ప్లాన్‌ చేస్తున్నాడు. ప్రవీణ్‌ సత్తారు ఎప్పుడు కూడా ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ పనికి రాదు అంటూ కొందరు హెచ్చరిస్తున్నారు. మరి ఈయన నమ్మకం ఎంత వరకు నిలుస్తుంది అనేది చూడాలి.