'ఇంటి గుట్టు' అనే సరికొత్త మధ్యహ్నాపు ధారావాహికతో మీ ముందుకు వస్తుంది జీ తెలుగు  

ఎపుడూ కొత్తదనాన్ని కోరుకునే, ప్రేక్షకులు, మేము ఉన్నాం అని చెప్పే జీ తెలుగు ఈసారి కూడా మరో కొత్త ధారావాహికతో అందరిని అలరించడానికి వస్తుంది.‘ఇంటి గుట్టు’ అనే పేరుతో వచ్చే ఈ సీరియల్ అన్నపూర్ణ ప్రొడక్షన్స్ వారు ప్రొడ్యూస్ చేయగా, నవంబర్ 30 వ తేదీ నుంచి ,సోమవారం నుండి శనివారం వరకు మధ్యాహ్నం 2: 00 గంటలకు మీ జీ తెలుగు మరియు జీ తెలుగు హెచ్ డి ఛానెళ్లలో ప్రసారం చేయబోతుంది.,

TeluguStop.com - Zee Telugu Is Coming To You With The Latest Afternoon Series Called Inti Guttuannapurna Productionszee Telugu And Z Telugu Hd Channelkalyanianupama

కళ్యాణి(నిసర్గ) తన కుటుంబం యొక్క గారాల పట్టి.అలాంటి ఒక్క అమ్మాయి కుటుంబాన్ని విడిచి తన తండ్రి తో (సాయి కిరణ్) అక్రమ సంబంధం పెట్టుకున్న అనుపమ(మీనా వాసు) ఇంటిలో అడుగు పెడుతుంది.

అనుపమ అంటే కల్యాణికి ద్వేషం.విధి వక్రించడం చేత కల్యాణికి సంరక్షకురాలిగా అనుపమ మారుతుంది.మరి కళ్యాణి ఎవరినైతే ద్వేషిస్తుందో, వారి తోటి కలిసి ఉండగలుగుతుందా?ఏ బంధం లేని ఇద్దరు అపరిచితులు, తల్లీకూతురి అనుబంధానికి ఒక సరికొత్త ఆరంభం పలుకుతారా? అని తెలుసుకోవాలంటే ఇంటి గుట్టు చూడాల్సిందే.

TeluguStop.com - ఇంటి గుట్టు’ అనే సరికొత్త మధ్యహ్నాపు ధారావాహికతో మీ ముందుకు వస్తుంది జీ తెలుగు-General-Telugu-Telugu Tollywood Photo Image

తెలుగు క్లస్టర్ హెడ్ అనురాధ గుడూర్ మాట్లాడుతూ, “ఇంటి గుట్టు మునుపెన్నడూ చూడని తల్లి కూతుళ్ళ సంబంధం యొక్క కోణాన్ని ప్రేక్షకులకు చూపించబోతుంది.

విధి యొక్క వక్రీకరణ కారణంగా ఇద్దరు అపరిచితులు ఒకరి జీవితాలలోకి మరొకరు ఇష్టం లేకుండా ప్రవేశిస్తారు.బంధాలు, భావోద్వేగాలు, అలాగే ప్రేమ కలిసిన ఈ సరికొత్త మధ్యహ్నాపు ధారావాహిక అందరికి నచ్చుతుంది అని ఆశిస్తున్నాను.ఇంటి గుట్టు ద్వారా, మా మధ్యహ్నాపు సీరియళ్ల ద్వారా తెలుగు ప్రేక్షకులు మమ్మల్నిఇంకా ఆదరిస్తారని భావిస్తున్నాను.”
రోహిత్, రూప, రజిత, గిరీష్, శివ పార్వతి, మల్లాధి, హేమంత్, రితు చౌదరి మరియు తదితరులు కీలక పాత్రలను పోషించారు.కల్యాణి మరియు అనుపమ యొక్క సరికొత్త అనుబంధాన్ని చూడటానికి నవంబర్ 30 నుంచి ప్రతి సోమవారం నుండి శనివారం వరకు మధ్యాహ్నం 2 :00 గంటలకు మీ జీ తెలుగు మరియు జీ తెలుగు హెచ్ డి ఛానెళ్లలో తప్పక వీక్షించండి.

ఈ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేయడానికి జీ తెలుగుని సబ్ స్క్రైబ్ చేసుకోండి.

జీ తెలుగు ప్రైమ్ ప్యాక్ నెలకు 20 రూపాయలు మాత్రమే.మీ అభిమాన జీ తెలుగు కార్యక్రమాల్ని మిస్ అవ్వకండి.

జీ తెలుగు, జీ సినిమాలతో పాటు జీ నెట్ వర్క్ కు చెందిన 7 టాప్ ఛానెల్స్ తో ఉన్న జీ ప్రైమ్ ప్యాక్ ను ఎంచుకోండి.నెలకు కేవలం 20 రూపాయలకు మీ కుటుంబమంతటికీ కావాల్సిన వినోదాన్ని అందించే ప్యాక్.

మరిన్ని వివరాలకు మీ దగ్గర్లోని డీటీహెచ్ లేదా కేబుల్ ఆపరేటర్ ను సంప్రదించండి.

జీ తెలుగు గురించి జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ (ZEEL)కు చెందిన జనరల్ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ జీ తెలుగు.2005 మే 18న ప్రారంభమైన జీ తెలుగు ఛానల్ తో సౌతిండియాలో ఎంటరైంది ఈ సంస్థ.దేశవ్యాప్తంగా ఉన్న 75 మిలియన్ తెలుగు ప్రేక్షకులకు ప్రతి వారం వివిధ రకాల వినోద కార్యక్రమాల్ని అందిస్తోంది జీ తెలుగు.

ఫిక్షన్ షోస్ నుంచి రియాలిటీ షోస్, టాక్ షోస్ వరకు వివిధ రకాల కార్యక్రమాలతో అల్టిమేట్ ఎంటర్టైన్ మెంట్ డెస్టినేషన్ గా అందరితో గుర్తింపు తెచ్చుకుంది.విలక్షణమైన స్టోరీలైన్స్ తో ఫిక్షన్ కార్యక్రమాలు, అదిరిపోయే నాన్-ఫిక్షన్ షోస్, అదిరిపోయే ఫార్మాట్స్ లో ఈవెంట్స్ తో పాటు అన్ని వర్గాల వారిని అలరించే టాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీస్ శాటిలైట్ హక్కుల్ని దక్కించుకొని.

అద్భుతమైన కంటెంట్ ను అందిస్తోంది జీ తెలుగు.

సమతూకంగా ఉండే కంటెంట్ తో పాటు విభిన్నమైన కార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో టాప్ జీఈసీ ఛానెల్ గా కొనసాగుతోంది జీ తెలుగు.

అన్ని కేబుల్ మరియు డిజిటల్ వేదికలపై జీ తెలుగు పూర్తిస్థాయిలో విస్తరించి ఉంది.ఇప్పుడు జీ5లో కూడా లభ్యమౌతోంది.

#Zee Prime Pack #ZeeTelugu #Inti Guttu #Kalyani #Anuradha Gudur

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు