ఆ హీరోయిన్ ఎన్ని పెళ్లిలు చేసుకుందో తెలుసా.? కానీ చివరికి ఏమైందో చూస్తే కన్నీళ్లే.!       2018-06-08   00:20:50  IST  Raghu V

తెలుగు, తమిళంలో ఒకప్పుడు హీరోయిన్ గా నటించి ప్రస్తుతం సినిమాలు, సీరియళ్ళలో తల్లి పాత్రలు (క్యారెక్టర్ ఆర్టిస్ట్) గా చేస్తున్న “సీత” గారు అందరికి పరిచయమే. కానీ ఆమె జీవితంలో ఎదుర్కున్న బాధాకరమైన ఈ సంఘటనల గురించి చాలా మందికి తెలీదు. వెండి తెర మీదనే కాదు బుల్లి తెరమీద కూడా తన నటన ప్రతిభను కనబరుస్తూ వచ్చారు “సీత” గారు. సినిమాల్లో అందరిని మెప్పించే పాత్రల్లో చేసిన “సీత” నిజజీవితంలో ఎన్నో కష్టాలు పడ్డారు.

1990 లో హీరోయిన్ గా తనకు అవకాశాలు తగ్గుతున్న సమయంలో “పార్తీబన్” ను పెళ్లి చేసుకున్నారు సీత. మొదట్లో ఇద్దరు అన్యున్యంగా ఉన్నారు. వీరికి ముగ్గురు పిల్లలు. కొన్ని సంవత్సరాలు సంసారం చేసిన తరవాత ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. విడాకులు తీసుకున్నారు. సీత పై అతనికి ఉన్న అనుమానమే ఇద్దరి మధ్య గొడవకు దారి తీశాయట.

-

విడాకుల తరవాత మళ్ళీ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చారు. 2010 లో బుల్లితెర రంగ ప్రవేశం చేసారు. అదే సమయంలో సీరియల్ నటుడు “సతీష్” ను పెళ్లి చేసుకున్నారు “సీత”. కానీ అతనితో కూడా సీత సంతోషంగా ఉండలేకపోయింది. అతని దగ్గరనుండి కూడా విడాకులు తీసుకుంది.

-

తరవాత కొద్ది రోజులు ఒంటరి జీవితానికి అలవాటు పడింది. ఇప్పుడు మళ్ళీ ముగ్గురు పిల్లలతో గడపాలని మొదటి భర్తకు దగ్గరవుదామని ప్రయత్నిస్తుంది. కానీ దీనికి పార్తీబన్ ఒప్పుకోవట్లేదంట.

-

దీనితో సీత జీవితంకి ఒంటరితనం మాత్రమే తోడుగా మిగిలింది.