ఆ యువ క్రికెటర్ తో "షారుఖ్" కూతురు ప్రేమాయణం? సుహానాను బుట్టలో పడేసింది ఎవరంటే?       2018-06-04   00:39:31  IST  Raghu V

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ గురించి కొత్త పరిచయం అవసరంలేదు అనుకుంట. టాప్ హీరో గా మంచి పేరు సంపాదించుకున్నాడు షారుక్. ప్రస్తుతం కూతురు సుహానా ఖాన్ ను సినీ పరిశ్రమకు పరిచయం చేసే పనిలో కూడా ఉన్నాడు షారుక్.

అయితే ఐపీఎల్ కోల్కత్త నైట్ రైడర్స్ టీం కు ఓనర్ షారుఖ్ అన్న విషయం అందరికి తెలిసిందే.

-

ఇది ఇలా ఉంటె..సినీ తారలు, క్రికెటర్ల సంబంధాలు సర్వ సాధారణమే. ఆ జాబితాలో విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్ ఇలా చాలా మంది క్రికెటర్స్ బాలీవుడ్ భామలతో రొమాన్స్ చేసిన వారు ఉన్నారు.

-

ఇటీవలే కే ఎల్ రాహుల్, నిధి అగర్వాల్ రిలేషన్ ఉన్నట్లు వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ కోవలోకి షారుఖ్ ఖాన్ కూతురు సుహానా కూడా చేరిపోయింది. ఎవరా క్రికెటర్ అనుకుంటున్నారా?

-

బాలీవుడ్‌ బాద్‌షా, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ యజమాని షారుఖ్‌ ఖాన్‌ కూతురు సుహానా ఖాన్‌ యువ క్రికెటర్‌ శుబ్‌మాన్‌ గిల్‌తో ప్రేమలో పడినట్లు వార్తలు వస్తున్నాయి.

-

ఐపీఎల్‌ మ్యాచ్‌ల అనంతరం నైట్‌రైడర్స్‌ యువ ఆటగాడు గిల్‌తో సుహానా ముచ్చటించడం అందరి ఆకర్షించింది. ప్రస్తుతం వీరు బయట డిన్నర్లు, పార్టీలకంటూ తిరుగుతున్నారని సోషల్‌ మీడియాలో వదంతులు వినిపిస్తున్నాయి. సుహానా ఇటీవలే తన 18వ పుట్టిన రోజు వేడుకలు చేసుకుంది.