ఆ మంత్రిపై చంద్రబాబు సీరియస్..విస్తరణ లో “సైడేస్తారా”     2018-05-14   21:42:46  IST  Bhanu C

తెలుగుదేశం పార్టీ లో రోజు రోజు కి క్రమశిక్షణ తప్పుతోంది..చంద్రబాబు ముందు మాట్లాడాలంటేనే భయపడే వాళ్ళు కూడా ఇప్పుడు తలేగరేసి మాట్లాడుతున్నారు..దీనికి కారణం ఏమనేది పక్కన పెడితే చంద్రబాబు ఈ మధ్య కాలంలో సుతి మెత్తగా వ్యవహరించడమే అంటున్నారు పార్టీ సీనియర్ నేతలు..అంతేకాదు చంద్రబాబు చేయద్దు అన్న పనులు చేయడం..ఓపెన్ గానే వైసీపి కార్యకర్తలకి సపోర్ట్ చేయడం లాంటి సంఘటనలు జరుగుతున్నాయట. అయితే గత కొంత కాలంగా తన క్యాబినెట్ మంత్రి ఏకంగా బాబు గారికి తలనేప్పిలా మారాడు అంటున్నారు

ఇంతకీ ఎవరా మంత్రి ఏమిటా కధ అంటే..పార్టీ లో సీనియర్ నేతగా ఉన్న సోమిరెడ్డి ఈ మధ్య ఎన్నో ఆర్లు చంద్రబాబు హెచ్చరించినా సరే అస్సలు బాబు గారి మాటల్ని పట్టించుకోవడం లేదట మీరు ఎన్నిసార్లు చెప్పినా హెచ్చరించినా..మందలించినా…ఎమ్మెల్యేలకు నియోజకవర్గాల పార్టీ ఇన్‌ఛార్జిలకు తెలియకుండా ఎటువంటి ప్రారంభోత్సవాలు చేయకూడదని సోమిరెడ్డి కి చెప్పినా సరే ఖాతరు చేయడంలేదని పలువురు నేతలు ఈ సమావేశంసందర్భంగా ఫిర్యాదు చేశారు.

ఇదిలాఉంటే కొద్దిరోజుల క్రితం నెల్లూరు గ్రామీణ నియోజకవర్గంలో జరిగిన ప్రారంభోత్సవానికి ముందుగానే తేదీలు సమయం నిర్ణయించారు…అయితే ఈ కార్యక్రమానికి ఆ నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఆదాల ప్రభాకర్‌రెడ్డికి సమాచారం ఇవ్వలేదు…అంతే కాకుండా బెట్టింగ్‌ కేసులో ముద్దాయిగా ఉన్న వైసీపి నేత కోటంరెడ్డికి సోమి రెడ్డి పరోక్ష మద్దతు తెలుపుతున్నారని అంటున్నారు.మా పనులు కన్నా సరే ఆయన చెప్పే పనులు క్షణాలలో అవుతున్నాయని తెలుగుదేశం ఇంతలు గగ్గోలు పెడుతున్నారుట..