ఆ ఎమ్మెల్యే నన్ను చెరిచాడు..సంచలనం రేపిన సంఘటన       2018-05-30   01:51:05  IST  Raghu V

ఉన్నవ్‌ దారుణం అందరు మర్చిపోక ముందే యూపీలో మరొక దారుణం వెలుగు చూసింది..బీజెపి ఎమ్మెల్యే తనపై అత్యాచారం చేశాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన మళ్ళీ ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది…బిసౌలీ బీజేపీ ఎమ్మెల్యే కుషాగ్ర సాగర్ తనపై పలు సార్లు అత్యాచారం చేశాడని 22 ఏళ్ల యువతి బడౌన్ జిల్లా ఎస్పీ కళానిధికి ఫిర్యాదు చేసింది…దాంతో ఈ విషయం దేశ వ్యాతంగా సంచలమ అయ్యింది..

భాదిత యువతి ఫిర్యాదు ప్రకారం తాను పదహారేళ్ల వయసులో ఉన్నపుడు 2012వ సంవత్సరంలో తన తల్లితో పాటు కలిసి కుషాగ్ర సాగర్ ఇంటికి వెళ్లానని..అయితే ఆ సమయంలో నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి మరీ అత్యాచారం చేశాడని బాధిత యువతి పోలీసులకు సాక్ష్యాలతో సహా తెలిపిందని పోలీసులు తెలిపారు అయితే

2012 నుంచి 2014 వరకు కుషాగ్ర సాగర్ తనపై పలుసార్లు అత్యాచారం చేశాడని, ఇప్పుడు ఎమ్మెల్యే జూన్ 17వతేదీన మరో యువతిని పెళ్లాడనున్నాడని యువతి వెల్లడించింది.

అయితే నా జీవితం నాశనం అయ్యిందని ఇటువంటి పరిస్థితిలో తనని ఎవరు పెళ్లి చేసుకుంటారు అంటూ భాదిత మహిళా అవేడా వ్యక్తం చేస్తోంది…ఈ ఫిర్యాదుపై సర్కిల్ పోలీసు అధికారి నీతి ద్వివేదితో ప్రత్యేక దర్యాప్తు చేయిస్తున్నామని నివేదిక వచ్చాక ఎమ్మెల్యే నిందితుడని తేలితే చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.
ఆనోటా ఈ నోటా ఈ విషయం బయటకి పొక్కి రచ్చ రచ్చ..అవ్వడంతోనే సదరు ఎమ్మెల్యే ఆ యువతితో రూ.10లక్షలు ఇచ్చి రాజీ కుదుర్చుకున్న ఒప్పంద పత్రాన్ని ఆ ఎమ్మెల్యే పోలీసులకు సమర్పించారు.


అయితే ఇదంతా ప్రత్యర్ధుల పన్నుతున్న కుట్ర అని ఎమ్మెల్యే మీడియా ముఖంగా తెలిపారు..అయితే బీజేపీ ఎమ్మెల్యే కుషాగ్ర సాగర్ తండ్రి అయిన మాజీ బీఎస్పీ ఎమ్మెల్యే యోగేంద్ర సాగర్ 2008లో ఓ మహిళపై అత్యాచారం, మరో హత్య కేసులో జైలులో ఉండటం గమనార్హం..అయితే భాదిత మహిళతో రాజీ ఒప్పందం కుదుర్చుకున్న ఎమ్మెల్యే తప్పు చేసినట్టే కదా అని ఆ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి..