“ఆ ఎమ్మెల్యే” అల్లుడు టార్గెట్ గా “పవన్ షాకింగ్ కామెంట్స్”       2018-05-23   01:45:34  IST  Bhanu C

పవన్ కళ్యాణ్ మళ్ళీ ఉగ్రరూపం దాల్చాడు..గత కొంతకాలంగా టీడీపీ పార్టీ మరియు చంద్రబాబు లోకేష్ లే టార్గెట్ గా పవన్ కళ్యాణ్ చేస్తున్న కామెంట్స్ ఎంతో చర్చనీయాంశం అయిన విషయం అందరికీ తెలిసిందే అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఎప్పటికప్పుడు ఈ విషయాలని తన ఆరోపణలని ప్రజలు మర్చి పోకుండా ఎప్పటికప్పుడు గుర్తు చేస్తునే ఉంటారు అయితే తాజాగా జరిగిన ఒక సంఘటన ఇప్పుడు మళ్ళీ టీడీపీ లో కలకలం సృష్టిస్తోంది..పవన్ కళ్యాణ్ ఇప్పుడు చేస్తున్న వ్యాఖ్యలు ఒక్క అధినేత చంద్రబాబు లోకేష్ లపైనే కాకుండా మెల్ల మెల్లగా పార్టీ లోని నేతలపై కూడా చేయడం ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ అయ్యింది.


పవన్ కళ్యాణ్ తాను ప్రసంగించే పార్టీ సారి ప్రత్యేకంగా లోకేష్ చంద్రబాబు అవినీతిపై మాట్లాడుతున్నారు. పలు వేదికలపై టీడీపీ ని ఉతికి ఆరేసిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు పార్టీలో ముఖ్య నేతలపై పడ్డారు..ప్రస్తుతం పోరాట యాత్ర పేరుతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో పవన్ పర్యటన సాగుతున్న విషయం తెలిసిందే అయితే సుమారు 45 రోజుల పాటు సాగే ఈ పర్యటన ప్రస్తుతం.. పవన్ యాత్ర శ్రీకాకుళంలో సాగుతోంది.

అయితే కాశీబుగ్గలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన పవన్.. అక్కడి స్థానిక పలాస నియోజకవర్గ ఎమ్మెల్యే అల్లుడి భాగోతంపై నోరు విప్పారు.. ప్రభుత్వానికి “జీఎస్టీ” రూపంలో పన్నులు కడుతున్న ప్రజలు.. పలాసాలో ఎమ్మెల్యే అల్లుడికీ వ్యాపారులు “జీఎస్టీ” చెల్లించాల్సి వస్తోందంటూ వ్యాఖ్యలు చేసి ఒక్కసారిగా సంచలన సృష్టించారు..పలాసలో టీడీపి జీఎస్టీ నడుస్తోంది ఈ విషయంపై చంద్రబాబు గారు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

టీడీపీ సర్కారులో ముఖ్యంగా పలాసలో భూకబ్జాలు ఎక్కువయ్యాయని ఇది కేవలం టీడీపీ హయాంలో ఎక్కువగా ఉందని తెలిపారు..అయితే ఇక్కడ అందరినీ ఆశ్చర్య పరిచిన విషయం ఏమింటే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అల్లుడి ప్రస్తావన తీసుకు రాగానే ఒక్కసారిగా అందరు పవన్ కి అనుకూలంగా స్పందన తెలుపడం ఆశ్చర్యం కలిగించింది…స్థానిక నాయకత్వం మీదా వ్యతిరేకత ఇంత భారీగా పెరిగిన వైనాన్ని చంద్రబాబు ఎందుకు గుర్తించటం లేదన్నది ప్రశ్నగా మారింది…