ఆ ఇద్దరు లేడీస్‌కు మాత్రమే ఆఫీసర్‌ నచ్చాడు       2018-06-03   00:26:28  IST  Raghu V

రామ్‌ గోపాల్‌ వర్మ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘ఆఫీసర్‌’ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ రూపొందిన ‘ఆఫీసర్‌’ చిత్రంలో నాగార్జున పోలీస్‌ ఆఫీసర్‌గా నటించిన విషయం తెల్సిందే. ఈ చిత్రం తాజాగా విడుదలై అట్టర్‌ ఫ్లాప్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. గత పుష్కర కాలంగా రామ్‌ గోపాల్‌ వర్మకు సక్సెస్‌ అనేదే లేదు. ఈసారి అయినా వర్మకు సక్సెస్‌ దక్కుతుందేమో అని అంతా భావించారు. కాని వర్మకు మరోసారి నిరాశే ఎదురు అయ్యింది. నాగార్జునకు శివ రేంజ్‌ సినిమా ఇస్తాను అంటూ మాట ఇచ్చిన వర్మ తీవ్రంగా నిరాశ పర్చాడు. ఈ సినిమాతో నాగార్జున కూడా చాలా నిరుత్సాహంగా ఉన్నట్లుగా ఆయన అభిమానులు మరియు సన్నిహితులు చెబుతున్నారు.

వర్మ ఇలాంటి సినిమా తీస్తాడని ఊహించలేదని, ఆయన గత సినిమాలు ఫ్లాప్‌ అయినప్పటికి ఈ సినిమాలో కాస్త అయినా మ్యాటర్‌ ఉంటుందని ఆశించాం. కాని సినిమాలో మరీ దారుణమైన సీన్స్‌ ఉన్నాయని, మూస కథ కథనాలతో సినిమాను వర్మ ఆకట్టుకునే విధంగా తెరకెక్కించడంలో పూర్తిగా విఫలం అయ్యాడు అంటూ విమర్శకుల వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి సమయంలో సినిమా సూపర్‌ అంటూ ఇద్దరు ఆడవారు సోషల్‌ మీడియాలో తెగ ప్రచారం చేస్తున్నాడు. రామ్‌ గోపాల్‌ వర్మ సినిమాపై అంతగా ప్రశంసలు కురిపిస్తున్నా ఆ ఇద్దరు ఆడవారు మరెవ్వరో కాదు అక్కినేని అమలా మరియు శ్రీరెడ్డి.
తన భర్త సినిమా అవ్వడం వల్ల అక్కినేని అమల ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తుంది. నాగార్జునను కొత్తగా చూపించాడని, సినిమా కూడా చాలా బాగుందని, తనకు అన్ని విషయాల్లో నచ్చిందంటూ అమలా పేర్కొంది. అమలా వ్యాఖ్యలు అందరిని ఆశ్చర్యంకు గురి చేస్తున్నాయి. ఈ సమయంలోనే శ్రీరెడ్డి కూడా సినిమా సూపరో సూపర్‌ అంటూ కామెంట్స్‌ చేసింది. వర్మ ఆఫీసర్‌ సినిమాను కొందరు ట్రోల్‌ చేస్తున్నారు. వారు ఎవరు అనే విషయం అందరికి తెలుసు. సినిమాను ప్రేక్షకులు ఆధరిస్తున్నారు. కాని కొందరు మాత్రమే సినిమాపై విమర్శలు చేస్తున్నారు అంటూ శ్రీరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసింది.

రామ్‌ గోపాల్‌ వర్మ చేసిన ఈ సినిమాను అందరు కూడా బాగాలేదని అంటుంటే అమలా మరియు శ్రీరెడ్డిలు మాత్రం బాగుంది, చూడండి అంటూ చెబుతుండటం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చర్చనీయాంశం అవుతుంది. శ్రీరెడ్డికి వర్మపై చాలా అభిమానం ఉంది. ఆ అభిమానంతోనే ఇలా సోషల్‌ మీడియాలో ఆఫీసర్‌కు మద్దతుగా క్యాంపెయినింగ్‌ను నిర్వహిస్తుంది అంటూ కొందరు అంటున్నారు. పవన్‌ ఫ్యాన్స్‌పై కోపంతోనే శ్రీరెడ్డి వర్మ సినిమాపై ప్రశంసలు కురిపిస్తుందని కొందరు అంటున్నారు. వీరిద్దరు ఎంత మొత్తుకున్నా కూడా ఆఫీసర్‌ సినిమా అట్టర్‌ ఫ్లాప్‌ అనేది అందరు ఒప్పుకోవాల్సిందే. ఈ విషయాన్ని వర్మ కూడా ఒప్పుకుంటాడని ఆశిద్దాం.