ఆ అలవాటు మానుకోలేకపోతున్నా..! తప్పదు పెంచాల్సిందే..! "శృతి" సంచలన వ్యాఖ్యలు!  

  • శృతిహాసన్…స్టార్ హీరో కమల్ హాసన్ కూతురుఅయినప్పటికీ తనంతట తానుగా గుర్తింపు రావాలనుకున్నదిదానికోసం కష్టపడింది కూడామొదట్లో శృతిని అందరూ ఐరన్ లెగ్ అనేవారుకానీ పవన్ తో చేసిన గబ్బర్ సింగ్ సినిమా శృతి ఫేట్ మార్చేసిందిఎక్కడలేని క్రేజ్ ఆమె సొంతమైంది.టాప్ హీరోల సరసన అవకాశాలు తెచ్చిపెట్టిందిశృతికి సంభందించిన ఒక టాపిక్ ఇప్పుడు మీడియాలో ప్రచారం జరుగుతుంది.

  • -

  • -
  • ‘‘ఎందుకో మనకు కొన్ని విషయాలు చాలా బాగా నచ్చుతాయి. వాటి గురించి ఎందరు ఎన్ని రకాలుగా చెప్పినా వదులుకోబుద్ధి పుట్టదు. నాక్కూడా అలా నచ్చిన అంశాల లిస్ట్‌ ఒకటుంది’’ అని అన్నారు శ్రుతీ హాసన్‌. ఈ మధ్యనే లండన్‌కి వెళ్లి తిరిగి వచ్చారు శ్రుతి. ఆమె మాట్లాడుతూ ‘‘నాకు చాపింగ్‌ చానెల్స్‌ అంటే చాలా ఇష్టం. ‘చిన్న పిల్లలాగా అదేం అలవాటు’ అనేవాళ్లున్నారు.

  • -
  • అయినా నాకు గ్రేట్‌ స్ట్రెస్‌ బస్టర్స్‌ అవే’’ అని అన్నారు. ‘అయ్యో’ అనేది శ్రుతీ హాసన్‌కి ఊతపదమట. అన్ని వేళలా ఆ పదాన్ని వాడకూడదని చాలా మంది పెద్దవారు చెప్పారట. అయినా ఆ పదం వాడటాన్ని మానుకోలేకపోతున్నట్టు తెలిపారు.

  • -
  • అబ్బాయిలకు సంబంధించి ఇలాంటి అభిప్రాయాలు ఏమైనా ఉన్నాయా అని ఆరాతీస్తే… ‘ఎందుకు లేవు ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఒక విషయం ఉంది’ అని అన్నారు. ఇంతకీ ఏంటా విషయం అని అడిగితే ‘‘క్లీన్‌ షేవ్‌తో ఉన్న అబ్బాయిలు నాకు పెద్దగా నచ్చరు. గడ్డంతో ఉన్న అబ్బాయిల్లో ఏదో అట్రాక్షన్‌ ఉంటుంది. నన్ను ఆకట్టుకోవాలని ఎవరైనా అనుకుంటే ముందు గడ్డం పెంచాల్సిందే’’ అని తెలిపారు శ్రుతీ హాసన్‌.