నల్లగొండ జిల్లా:రోజు వారీ విధుల్లో భాగంగా డ్యూటీ నిర్వహిస్తుండగా ఆర్టీసీ బస్సులో గుండెపోటుతో మహిళా కండక్టర్ మృతి చెందిన విషాద సంఘటన మంగళవారం మిర్యాలగూడలో చోటుచేసుకుంది.మిర్యాలగూడ నుంచి నల్లగొండకు వెళుతున్న ఆర్టీసీ బస్సులో కండక్టర్ గా విధులు నిర్వహిస్తున్న మహిళా కండక్టర్ భారతి శెట్టిపాలెం సమీపంలోకి వెళ్ళగానే గుండెపోటుతో బస్సులోనే పడిపోయింది.
వేములపల్లి పీ.హెచ్.సీలో పరీక్షలు నిర్వహించగా పరిస్థితి విషమించడంతో హుటాహుటిన మిర్యాలగూడ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు.నాగార్జున సాగర్ పరిధిలోని హాలియాకు చెందిన మృతురాలికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.