బరి తెగించిన కామందుడు..తల్లీ కూతుళ్ళపై       2018-05-28   00:33:42  IST  Raghu V

గుంటూరు జిల్లా లో వెలుగు చూసిన మరో దారుణం…రోజు రోజు కి మనిషి అనే వాడు ఎంతటి హీన స్థితికి..దిగజారి పోతున్నాడో అర్థం అవుతోంది..ప్రపంచ దేశాలకి భారత దేశం అంటే ఒక స్పూర్తిగా ఉంటోంది..భారత దేశం అంటేనే సాంప్రదాయాలకి ,విలువలకి..మనుషల మధ్య ఉండే రక్త సంభందాలకి నెలవు అయితే ఎంతో మంది మృగాళ్ళు ఈ భందాలని అపవిత్రం చేస్తున్నారు..రక్త సంభంధం అనుకునే వారిపైనే అత్యాచారాలకి పాల్పడటం ఎంతో ఆందోళనకి గురి చేస్తోంది..మనిషి ఎటువైపు వెళ్తున్నాడో తెలియని పరిస్థితి నెలకొంది..గుంటూరు జిల్లా దాచేపల్లి సంఘటన మరువక ముందే తాజాగా జరిగిన మరో సంఘటన తీవ్ర కలకలం రేపుతోంది..

గుంటూరు జిల్లా తెనాలి ముత్తింశెట్టిపాలెంలో మరో బాలికపై కన్నేసిన ఒక కామాందుడు ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడి గర్భవతిని చేశాడు..వివరాలలోకి వెళ్తే.. ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన ఓ మహిళ తన భర్త తనని వదిలేసి ఏటో వెళ్లిపోవడంతో ఒంటరిగా కూలి పనులు చేసుకుంటూ ఐదేళ్లుగా తెనాలి ముత్తింశెట్టిపాలెంలో నివసిస్తోంది…అయితే ఈ క్రమంలో ఆమెకు ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడి సహజీవనం చేస్తోంది…అయితే ఆమెకి ఇద్దరు పిల్లలు వారు టంగుటూరులో చదువుకుంటున్నారు.

ఈ క్రమంలోనే ఆమె అనారోగ్యానికి గురవ్వడంతో తన కుమార్తెని తెనాలికి రమ్మని చెప్పి తన దగ్గరే ఉంచుకుంటోంది ఆమెకి 16 ఏళ్ల అయితే ఇంట్లోనే ఉంటూ ఆమెతో సహజీవనం సాగిస్తున్న వ్యక్తి.. కల్లబొల్లి మాటలు, బెదిరింపులతో బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు…అయితే ఈ విషయం తెలియని ఆమె తల్లి ఎప్పటిలాగానే అతడిని ఇంటికి పిలిపిస్తూ ఉండేది.

అయితే ఈ నెల 24న బాలికకు విపరీతమైన జ్వరం రావడంతో వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లగా ఆమె తల్లి కాబోతోందని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ కి గురయిన తల్లి అసలు విషయం తెలుసుకుని తల్లడిల్లి పోయింది..కూతురుని తీసుకుని పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేసింది. భాదితురాలి నుంచీ ఫిర్యాదు తీసుకున్న పోలీసులు కేసుని విచారిస్తున్నట్టుగా తెలిపారు..కూతురిలా చూసుకోవలసిన ఆమెపై అతడు చేసిన దారుణానికి ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి .