అసలు పూనంకు త్రివిక్రమ్‌ చేసిన ద్రోహం ఏంటీ?       2018-05-26   01:45:58  IST  Raghu V

కొన్నాళ్ల క్రితం కత్తి మహేష్‌బాబు వరుసగా పవన్‌ను టార్గెట్‌ చేస్తూ విమర్శు చేస్తున్న సమయంలో అనూహ్యంగా కత్తి మహేష్‌ను తిడుతూ పూనం కౌర్‌ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. కత్తి మహేష్‌ కూడా ఆమె విమర్శలకు ఘాటుగానే సమాధానం చెప్పాడు. ఆ సమయంలోనే ఆయన కొన్ని కీలక విషయాలను చెప్పాడు. పూనంకు త్రివిక్రమ్‌కు మద్య ఏదో విరోదం ఉందని, ఆ కారణంగానే ఆయన అంటే పూనంకు కోపం అంటూ చెప్పుకొచ్చాడు. అప్పటి నుండి కూడా పూనం ఏం చేసినా, ఏం మాట్లాడినా కూడా త్రివిక్రమ్‌ యాంగిల్‌లో జనాలు ఆలోచిస్తున్నారు.

గతంలో ఒక దర్శకుడు తనను మోసం చేశాడు అని, ఆయనకు పుట్టగతులు ఉండవు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన పూనం తాజాగా మరోసారి అలాంటి వ్యాఖ్యలు చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. జల్సాలు చేయించి, అజ్ఞాతంలోకి నెట్టేస్తాడు అంటూ, నమ్మక ద్రోహి అంటూ ట్వీట్‌ చేసింది. ఈ ట్వీట్‌ ఖచ్చితంగా త్రివిక్రమ్‌ గురించి అంటూ కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూనంకు ఆయనపై విరోదం ఉంది, దాంతో పాటు జల్సా మరియు అజ్ఞాతవాసి చిత్రాు త్రివిక్రమ్‌వి కావడం వల్ల కూడా ఆయనపైన పూనం ట్వీట్‌ చేసిందని, నమ్మకద్రోహీ అంటూ కామెంట్స్‌ చేసిందని కొందరు అంచనా వేస్తున్నారు.

ఇంతకు వీరిద్దరి మద్య వివాదం ఏంటీ అనే విషయం చాలా మందికి తెలియదు. అసలు విషయం ఏంటీ అంటే పవన్‌ కళ్యాణ్‌ హీరోగా నటించిన ‘జల్సా’ చిత్రంలో మొదట పూనం కౌర్‌ను ఎంపిక చేయడం జరిగింది. కాని ఆ స్థానంలో త్రివిక్రమ్‌ చెప్పా పెట్టకుండా మరో హీరోయిన్‌ను ఎంపిక చేశాడు. ఆ విషయం తెలియని పూనం కౌర్‌ షూటింగ్‌కు వెళ్లి మరీ అవమానంను ఎదుర్కొంది. మూడు రోజుల తర్వాత జల్సా నుండి ఆమెను తొలగించినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెప్పారట. దాంతో ఆమె తీవ్ర మనస్థాపంకు గురై ఆత్మహత్య ప్రయత్నం కూడా చేసిందనే టాక్‌ ఉంది.

అప్పుడు పవన్‌ ఆమెకు ఆర్థిక సాయం చేసి అండగా నిల్చున్నాడు. ఆ తర్వాత కూడా పలు సార్లు పవన్‌ ఆమెకు సాయంగా నిలిచాడు. కాని ఆమెకు మాత్రం త్రివిక్రమ్‌పై కోపం రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది. ఆమె తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ త్రివిక్రమ్‌పై విరుచుకు పడుతూనే ఉంది. ఈ వివాదంకు ఫుల్‌ స్టాప్‌ పెట్టాలి అంటే పవన్‌ ఏమైనా ఆమెతో మాట్లాడితే వర్కౌట్‌ అయ్యేనో చూడాలి. అయితే ఇప్పటి వరకు త్రివిక్రమ్‌ ఒక్క మాట కూడా పూనం కౌర్‌ గురించి స్పందించలేదు. ఆయన తన పనేంటో తాను చేసుకుంటూ వెళ్తున్నాడు. త్రివిక్రమ్‌ ఫ్యాన్స్‌ మాత్రం పూనంను తీవ్రంగా ట్రోల్‌ చేస్తున్నారు.