అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్ మంజూరు చేయాలి.

నల్లగొండ జిల్లా:అర్హులైన ప్రతి ఒక్కరికి నూతన పింఛన్లు మంజూరు చేయాలని టిడిపి నల్గొండ జిల్లా పార్లమెంట్ బీసీ సెల్ కార్యదర్శి రాపర్తి వినయ్ కుమార్ డిమాండ్ చేశారు.మూడు సంవత్సరాల నుండి వేలాది మంది అర్హులు దరఖాస్తు చేసుకున్నా ప్రభుత్వం మాత్రం నూతన పింఛను మంజూరు చేయకపోవడం సిగ్గుచేటన్నారు.

 Pension Should Be Granted To Everyone Who Is Eligible.-TeluguStop.com

మూడేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ పింఛన్లు మంజూరు చేయకపోవడం దుర్మార్గమన్నారు.వికలాంగులు,ఒంటరి మహిళలు, వృద్ధులు పింఛన్లు రాక నానా అగచాట్లు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అర్హులైన ప్రతిఒక్కరికీ నూతన పింఛన్లు మంజూరు చేసి నిరుపేదలను ఆదుకోవాలని కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube