చేతి గోరు పైన అర్థ చంద్రకార గుర్తు ఉందా? అయితే జాగ్రత్త ,మీరు ప్రమాదం లో ఉన్నట్లే... చేతి వేలి గోర్ల‌పై కింది వైపుకు ఉండే భాగంలో అర్ధ‌చంద్రాకారంలో నెల‌వంక‌ను పోలిన ఓ ఆకారం ఉంటుం       2018-05-26   06:28:40  IST  Raghu V

చేతి వేలి గోర్ల‌పై కింది వైపుకు ఉండే భాగంలో అర్ధ‌చంద్రాకారంలో నెల‌వంక‌ను పోలిన ఓ ఆకారం ఉంటుంది. దాన్ని మీరు ఎప్పుడైనా గ‌మ‌నించారా? గ‌మ‌నించే ఉంటారు లెండి. కానీ దాని గురించి మీకు తెలిసి ఉండ‌దు. కాగా ఆ ఆకారాన్ని ‘లునులా (lunula)’ అని పిలుస్తారు. ఈ లునులా మ‌న శ‌రీరంలోని అత్యంత సున్నిత‌మైన భాగాల్లో ఒక‌టిగా చెప్ప‌బ‌డుతోంది. లునులా అంటే లాటిన్ భాష‌లో స్మాల్ మూన్ అని అర్థం. అంటే నెల‌వెంక, చంద్ర‌వంక అన్న‌మాట‌. అయితే ఈ లునులా దెబ్బ‌తింటే మాత్రం ఆ గోరు పూర్తిగా నాశ‌న‌మ‌వుతుంద‌ట‌. ఒక వేళ ఏదైనా గోరును స‌ర్జ‌రీ చేసి తీసేసినా లునులా మాత్రం దెబ్బ‌తిన‌ద‌ట‌. అది ఎంత కాల‌మైనా అలాగే ఉంటుంద‌ట‌. ఈ క్ర‌మంలో లునులా ఉండే ఆకారాన్ని, రంగును బ‌ట్టి మ‌నం ఎదుర్కొంటున్న ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను కూడా సుల‌భంగా తెలుసుకోవచ్చ‌ట‌. అవేమిటో ఇప్పుడు చూద్దాం.

1.వేలి గోరుపై లునులా అస‌లు లేక‌పోతే వారు రక్త‌హీన‌త‌, పౌష్టికాహార లోపం వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నార‌ని తెలుసుకోవాలి.
2.ఒక‌వేళ లునులా రంగు నీలం లేదా పూర్తిగా తెలుపులో పాలి పోయి ఉంటే వారికి డ‌యాబెటిస్ రాబోతుంద‌ని అర్థం చేసుకోవాలి.

3.లును ల మీద ఎరుపు రంగులో మ‌చ్చ‌లు ఉంటే వారికి గుండె సంబంధ వ్యాధులు ఉన్నాయ‌ని తెలుస్తుంది.
4.లునులా యొక్క ఆకారం మ‌రీ చిన్న‌గా, గుర్తు ప‌ట్ట‌లేనంత‌గా ఉంటే వారు అజీర్ణంతో బాధ‌ప‌డుతున్నార‌ని, వారి శ‌రీరంలో విష, వ్య‌ర్థ పదార్థాలు ఎక్కువ‌గా పేరుకుపోయాయ‌ని తెలుసుకోవాలి.

మరి కొంత సమాచారం క్రింది వీడియో లో చూడండి