అమెరికాలో మరో తెలుగు విద్యార్ధి దుర్మరణం       2018-06-03   23:43:11  IST  Bhanu C

అమెరికాలో వరుసగా జరుగుతున్న భారతీయుల దుర్మరణాలు ఆందోళన కలిగిస్తునాయి..గడిచిన నెలరోజులుగా ఇద్దరు తెలుగు యువకులు అనుకోని ప్రమాదాల కారణంగా మరణించడం మనకి తెలిసిందే ఒకరు కొండపైకి ఎక్కి సెల్ఫీ తీసుకుంటూ ఉండగా జారి సముద్రంలో పడిపోగా మరొకరు అక్కడ దట్టమైన అడివిలోని కొండని ఎక్కుతూ జారి కిందపడి మరణించారు అయితే ఇదే తరహాలో మరొక విషాదం చోటు చేసుకుంది..

అమెరికాలోని బ్లూమింగ్ టౌన్‌లో ని మాన్రో సరస్సులో అనూప్ తోట అనే తెలుగు విద్యార్ధి గల్లంతయ్యాడు.. శుక్రవారం సాయంత్రం స్నేహితులతో కలిసి బోటింగ్ చేసిన అతడు సరదాగా ఈత కొట్టడాడు..ఈ క్రమంలో ఒక్కసారిగా అనూప్ కనిపించక పోవడంతో అతడి “ 911 ” కి ఫోన్ చేసి సమాచారం అందించారు. వెంటనే వచ్చిన రెస్క్యూ సిబ్బంది సైడ్ స్కానర్ సోనార్‌తో గాలింపు చేపట్టారు.

అయితే 48 గంటల పాటు అతడి మృతదేహం కోసం వెతికిన సిబ్బంది ఎట్టకేలకి అతడిని వెలికి తీశారు..తమ స్నేహితుడు లేదనే వార్త వారిని ఎంతో ఉద్వేగాన్ని కలిగించింది..అయితే అనూప్ ఈత కొడుతున్న సమయంలో ఓ పెద్ద అల వచ్చాక అనూప్ కనిపించకుండా పోయాడని అతడి స్నేహితుడు రుషిల్ రెడ్డి తెలిపారు.అయితే అనూప్ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఆయన గో ఫండ్ మీ ద్వారా నిధులు సేకరిస్తున్నట్టుగా తెలిపారు..