విషాదం : అమెరికాలో తెలుగు వ్యక్తి మృతి  

అమెరికా లో కుటుంబం సమేతంగా వీకెండ్ ట్రిప్ కి వెళ్లిన ఒంగోలు మండలం కొప్పోలు గ్రామనికి చెందిన సురేష్ నూనె ప్రమాదవశాత్తు జలపాతంలో పడి మృతి చెందాడు.సింటెల్ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా సురేష్ పని చేస్తున్నాడు..

%e0%b0%85%e0%b0%ae%e0%b1%86%e0%b0%b0%e0%b0%bf%e0%b0%95%e0%b0%be%e0%b0%b2%e0%b1%8b %e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b1%81%e0%b0%97%e0%b1%81 Telugu Nri Suresh Nune Died In Turner Waterfalls Oklahom River--

ఓక్లహోమాలోని ఎత్తైన జలపాతంగా పరిగణించబడే టర్నర్ ఫాల్స్ కు వీకెండ్ ట్రిప్ కి సురేష్ తన భార్య, కుమార్తె మరియు కొడుకుతో కలిసి ఫ్యామిలీ పిక్నిక్ కోసం టర్నర్ ఫాల్స్ కు వెళ్ళాడు.

పిల్లల్ని నీటిలో ఆడిస్తూవుండగా సురేష్ అనుకోకుండా జారిపడి జలపాతం కింద పడిపోవడంతో ఈ సంఘటన జరిగిందని తెలుస్తుంది .సురేష్ పడిపోయే తలకు గాయముకావటం వల్ల మరణించి ఉండవచ్చు అని ప్రాధమిక విచారణలో తెలిసినట్లు లోకల్ మీడియా కధనం.

ఇదే టర్నర్ ఫాల్స్ లో జూలై త్రీ న 27 ఏళ్ల భారతీయ మహిళ మరియు మరో ముగ్గురు లెడ్జ్ నుండి జారిపడి, జలపాతం సమీపంలో నీటిలో పడిపోయారు.

సురేష్‌బాబుకు భార్య,ఇద్దరు పిల్లలు.

పాప గాయత్రీ అక్షయ సంధ్య (13), బాబు సాయిమోహనీష్‌ (8).మూడేళ్ల క్రితం ఉద్యోగం నిమిత్తం వీరు అమెరికా వెళ్లారు.

స్వగ్రామంలో అంత్యక్రియలు తరలించేందుకు కుటుంబసభ్యుల ప్రయత్నం చేస్తున్నారు.అయితే మృతదేహం తరలింపుకు దాదాపుగా 80 వేల డాలర్లు ఖర్చు అవుతుంది.

సహాయము చేయాలి అనుకొనే వారు దయచేసి GOFUNDME లో DONATE చేయగలరు.

అందరికి షేర్ చేసి తోటి తెలుగు కుటుంబానికి సహాయం చేయగలరు.

GOFUND ME : GOFUND ME