అన్నాచెల్లెళ్ళు లవర్స్ గా మారితే? ఇదే ఈ సినిమా స్టోరి       2017-09-12   05:52:50  IST  Raghu V

హెడింగ్ చూడగానే మమ్మల్ని తిట్టుకోకండి. ఎందుకంటే ఇది మా క్రియేటివీటి కానే కాదు. ఇది ఓ సినిమా స్టోరి. చెత్తగా ఉందొ, కొత్తగా ఉందొ, మొత్తానికి ఓ వెరైటి ప్రయోగం చేస్తున్నారు బాలివుడ్ వారు. ఇందులో హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు యష్ రాజ్ పారా, అంకిత పరిహార్ నటిస్తున్నారు. సినిమా పేరు “I am Roshni”.

బేసిగ్ గా సినిమా కథ ఏమిటంటే, రోష్ని అనే అమ్మాయి జీవితంలో చాలా కష్టాలను చూస్తూ ఉంటుంది. తన బాయ్ ఫ్రెండ్ తన గుండెకి గాయం చేస్తాడు. మేనమామ తనమీద లైంగిక దాడికి పాల్పడతాడు. అలాంటి సమయంలో తన సొంత అన్నయ్య ఆమెకి సపోర్ట్ గా నిలుస్తూ జీవితం మీద ఆశలు పెరిగేలా చేస్తాడు. ఇక్కడ ట్విస్టు ఏమిటంటే, సొంత అన్నాచెల్లెళ్ళు ప్రేమలో పడిపోతారు.

భారతీయ సినిమా చరిత్రలో ఈ కాన్సెప్ట్ తో ఇప్పటివరకు ఓ సినిమా రాలేదు. గే లవర్స్ మీద, లెస్బియన్ లవర్స్ మీద సినిమాలు వచ్చాయి కాని, ఇలా తోబోట్టువులు ప్రేమలో పడటం ఇదే మొదటిసారి. దీన్నే Incest Love అని అంటారు. ఇలాంటి కథలు హాలివుడ్ లో వచ్చాయి. అంతెందుకు, మన భారతీయ ప్రేక్షకులకి బాగా పరిచయమైన Game of Thrones మరియు Dexter లాంటి టీవి సీరిస్ లో కూడా అన్నాచెల్లెళ్ళ ప్రేమకథలు ఉన్నాయి. మరి వాటిని ఆసక్తిగా చూసిన భారతీయ ప్రేక్షకులు, అలాంటి ప్రయోగం మనదగ్గర జరుగుతోంటే ఎలా స్పందిస్తారో చూడాలి.