అక్రమంగా “అమెరికా” ప్రయాణం.. “భారత ఎన్నారై” సాహసం       2018-05-20   23:43:31  IST  Bhanu C

భారత ఎన్నారై అతిపెద్ద సాహసమే చేశాడు..అమెరికా వెళ్ళడం తన కలగా పెట్టుకున్నాడు అయితే కొన్ని కారణాల వలన చట్ట ప్రకారం తలెత్తిన ఇబ్బందుల వలన ఆ కల అలాగే ఉండి పోయింది..అయితే అతడి కోరిక తీరలేదనే కసితో ఎలా అయినా తన కలని నిజం చేసుకోవాలని అనుకున్నాడు..దాంతో అతి పెద్ద సాహసమే చేశాడు..అక్రమంగా అయినా సరే అమెరికా వెళ్ళాలని అనుకున్నాడు వివరాలలోకి వెళ్తే…

అమెరికా వెళ్ళాలని అనుకున్న ఆ యువకుడి పేరు హర్పీత్ సింగ్..పంజాబ్ రాష్ట్రానికి చెందిన అతడు తన కోరిక ఫలించక పోవడంతో అడ్డ దారిలో అమెరికాకి పయనమయ్యాడు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 11 దేశాలు గుండా 10 వేల కిలోమీటర్లు ప్రయాణించి అక్రమంగా అమెరికాలో చొరబడ్డాడు. దాదాపు ఏడాదిన్నపాటు అమెరికాలోని లూసియానాలో పని చేశాడు.

ఇదిలాఉంటే అతడు ముందుగా భారత్ నుంచీ బ్రెజిల్ వెళ్ళాడు అక్కడి నుంచీ బొలివియా చేరుకొని మళ్ళీ పేరూ వెళ్లి ఈక్వెడార్.. కోస్టారికా.. కొలంబియా.. పనామా.. హొండురాస్.. గ్యాటెమాలా.. మెక్సికో చేరుకున్నాడు..అయితే అక్కడి నుంచీ పడవ మార్గంలో అమెరికా చేరుకున్నాడని అధికారులు గుర్తించారు..దాంతో అతడిని పట్టుకుని విచారించి తిరిగి భారత్ కి పంపేశారు.. చివరికి హర్పీత్ ని పట్టుకుని న్యూఢిల్లీ పోలీసులకు అప్పగించారు. అయితే అతడు ఈ ప్రయాణం కోసం ఒక ఏజెంట్ సలహా తీసుకున్నాడని తేలింది..