అంబానీ కొడుకు పెళ్లి సందడి, పెళ్లి ఏర్పాట్లకి ఎంత ఖర్చు చేస్తున్నారో తెలుసా?       2018-06-06   01:39:38  IST  Raghu V

ప్రపంచ ధనవంతుల్లో ఒకరు , ఆసియాలోనే అత్యంత సంపన్న వ్యక్తి రిలయన్స్‌ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్‌ అంబానీ , వారి ఇంట్లో ఇప్పటికే పెళ్లి సందడి మొదలయింది. ఇప్పటికే ముఖేష్ దంపతుల కవల పిల్లలయిన పెద్ద కొడుకు ఆకాష్ అంబానీ, ఇషా అంబానీల నిశ్చితార్థం అయిందన్న విషయం తెలిసిందే. ఇక చిన్న కొడుకయిన అనంత్‌ అంబానీ పెళ్లి కూడా త్వరలో జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కాగా అంబానీ కుటుంబం యొక్క పెళ్ళి వార్త మరోమారు వార్తల్లోకెక్కింది. ఈ వార్తలకు ప్రధాన కారణం ఆకాష్ అంబానీ యొక్క ఎంగేజ్మెంట్ ఆహ్వాన వీడియో. ఆకాశ్ అంబానీ తన చిన్ననాటి స్నేహితురాలు శ్లోకా మెహతాను అతి త్వరలో వివాహం చేసుకోబోతున్నాడు. అసలే అత్యంత ధనవంతుడు పైగా వారి కుటుంబం లో పెద్ద కొడుకు పెళ్లి , మరి దేశంలో అంబానీ కుటుంబ పెళ్ళి అంటే మామూలుగా ఉంటుందా! అంచనాలన్నీ ఓ రేంజిలో ఉంటాయి.

ఆ అంచనాలకు తగ్గట్టుగానే వివాహ కసరత్తులు ప్రారంభించాడు అంబానీ. దీనికి సంబంధించి ప్రస్తుతం ఆకాశ్ అంబానీ ఎంగేజ్మెంట్ ఆహ్వాన వీడియోను విడుదలచేసి తాను పెళ్ళి ఎలా చేయబోతున్నాడో ఒక ట్రైలర్ ను చూపించాడు. షెహనాయి సాంగ్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఎంగేజ్మెంట్ వీడియో రూపొందించి, ఈ నెల 30వ తేది శనివారం, ముంబైలోని అట్లామౌంట్ రోడ్‌లో జరగనున్న తన పెద్ద కొడుకు ఆకాశ్ అంబానీ ఎంగేజ్మెంట్ వేడుకకు రావలసిందిగా అతిధులను ఆహ్వానించాడు.

-

గతంలో జరిగిన ఎంగేజ్మెంట్ కు బాలీవుడ్ ప్రముఖులు హాజరవగా ప్రస్తుతం జరుగబోయే దానికి అన్ని రంగాల్లోని వారిని ఆహ్వానించడం జరిగింది. వీరి ఎంగేజ్మెంట్ గత డిసెంబర్ లో జరగాల్సింది , అప్పుడే ఎంగేజ్మెంట్ ఇన్విటేషన్ కార్డ్ కే 1,50,000 రూపాయలు ఖర్చు చేశారనే వార్త వచ్చింది.. కార్డ్ కే అంత ఖర్చు చేస్తే ఇంకా ఎంగేజ్మెంట్ మొత్తానికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారనిపిస్తుంది ఎంగేజ్మెంట్ ఇంత భారీగా ఉంటే పెళ్లి ఎంత ఘనంగా ఉంటుందో చూడాలి..