అంతర్మధనంలో మోడీ..ఏపీ పరిణామాలే కొంప ముంచాయా..?  

బహుశా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలని మోడీ అస్సలు ఊహించి ఉండడు.దేశం మొత్తం మోడీ మానియాలో ఉన్న సమయంలో వరుసగా వస్తున్నా పరాజయాలు భంగపాటులు మోడీ పరువుని గంగలో కలిపేస్తునాయి.

తిరుగులేని నేతగా తల ఎగరేసుకుని ఉండే మోడీ ఇప్పటి పరిస్థితులకి తల దించుకుని దీల్ఘాలోచనలో పడేలా చేస్తున్నాయి.మోడీ నిరంకుశత్వ పాలన ఎక్కడ తన సీటు జారిపోతుందో అనే భయం తో చేస్తున్న దారుణాలు మోడీ ని ఇప్పుడు అందరి దృష్టిలో విలన్ చేస్తున్నాయి.

అంతర్మధనంలో మోడీ..ఏపీ పరిణామాలే కొంప ముంచాయా..-Latest News-Telugu Tollywood Photo Image

అందుకు నిదర్సనమే వచ్చిన ఉపఎన్నికల ఫలితాలు

2014 లోక్‌సభ ఎన్నికల్లో మోదీ హవాతో 282 స్థానాలతో పటిష్టంగా కనిపించిన భారతీయ జనతా పార్టీ 2018 వచ్చేసరికి 271 స్థానాలకు పరిమితమైంది…అయితే వివిధ కారణాల వల్ల ఖాళీ అయిన పది లోక్‌సభ స్థానాలని ఇప్పుడు బీజేపీ పోగొట్టుకోవడం అనూహ్యమైన మలుపుగా చెప్పచ్చు.మోడీ తరువాత అంతటి పేరు సంపాదించిన యోగీ తన రాజీనామాతో ఖాళీ అయిన స్థానాన్ని గెలిపించుకోలేక పోయారుఅ.

అదే విధంగా డిప్యూటీ సిఎం బాధ్యతలు స్వీకరించేందుకు కేశవ్ ప్రసాద్ మౌర్య కూడా తమ ఎంపీ స్థానాన్ని సాధించుకోలేక పోయారు.ఇలా బీజేపి ఎక్కడికక్కడ కాళీ అయిన తమ స్థానాలని తిరిగి సంపాదించడంలో విఫలం అయ్యారు.

ఇలా అనేక కారణాలతో మొత్తం పది స్థానాలను బీజేపీ కోల్పోయింది…కేంద్రంలో ప్రస్తుతానికి చక్రం తిప్పేది మోడీ సర్కారే కానీ మ్యాజిక్ ఫిగర్ కిందకి బిజేపి బలం తగ్గిపోవడం ఇపుడు బీజేపి కి నిద్రపట్టని విధంగా అయ్యింది ఒక పక్క మోడీ ని డీ కొట్టడానికి అన్ని ప్రాంతీయ పార్టీలు, కాంగ్రెస్, వామపక్షాలు భారీ స్కెచ్ వేస్తున్నాయి.ఇందులో వారు సక్సెస్ అవ్వడం కూడా మోడీ ని కలవర పెడుతున్న అంశమే.అయితే అసలు మోడీ కి ఉన్న చరిష్మా తగ్గడానికి గానీ దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు మోడీ పై నిప్పులు గక్కడానికి కానీ ఒకే ఒకే విషయం కారణంగా కనిపిస్తోంది.అదేంటంటే

దక్షిణాదిన ఎంతో కీలకంగా ఉండే ఏపీ ని కేంద్రం నమ్మించి మోసం చేయడం బీజేపి సర్కార్ మోడీ చేసిన మొదటి తప్పు నమ్మించి మోసం చేసి మరీ ఇచ్చిన మాటని వెనక్కి తీసుకోవడంతో ఏపీ ప్రజలు రగిలి పోయారు అందుకు తగ్గ పరిణామాలే కర్ణాటక ఎన్నికల్లో సైతం కనిపించాయి దాంతో ఒక్క సారిగా ఏపీ ప్రజలలో ఆగ్రహ జ్వాలలు రగిలిపోయాయి.

ఈ పరిణామాలే మాకు కూడా ఎదురయితే ఏంటి అనే ఆలోచన దేశంలో మిగిలిన ప్రాంతీయ పార్టీలకి కూడా కలిగింది.దాంతో ఒక్క సారిగా దేశ ప్రజలలో అభద్రతా భావం అలుముకుంది బీజేపి ని నమ్ముకున్న ఏపీ రాష్ట్రాన్ని నట్టేట ముంచింది ఈ సమయంలో మోడీ ని ఎలా నమ్మాలి అనే ఆలోచన ప్రతీ ఒక్కరిలో కలగడమే కాకుండా ప్రాంతీయ పార్టీలు అన్నీ ఇదే అంశాన్ని లేవనెత్తాయి ఏపీని వారి వారి ప్రజలకి ఉదాహరణంగా చూపిస్తూ మోడీ ని దెబ్బకొట్టడానికి ఏపీ సమస్యలని అస్త్రాలుగా మలుచుకున్నాయి చివరికి మోడీ తానూ తీసుకున్న గోతిలో తానే పడేలా చేశాయి.

నిలుస్తున్నాయి.యూపీ సహా అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ, స్థానిక ప్రాంతీయ పార్టీలు కూటమిగా ఏర్పడటం లేదా స్థానికంగా సర్దుబాటు చేసుకోవడం ద్వారా 2019లో మోదీ సర్కారుకు చెక్ పెట్టాలని ప్రతిపక్షాలు యోచిస్తున్నాయి.ఇదే జరిగితే బీజేపీకి గట్టి సవాలు ఎదురైనట్లే.2014లో మోదీ ప్రభావంతో ఉత్తరాదిలోని అనేక రాష్ట్రాల్లో బీజేపీ వందకు వంద శాతం స్థానాలు దక్కించుకుంది.2019లో అలాంటి పరిస్థితులు ఉండకపోవచ్చని ప్రతిపక్షాలు తాజా ఉపఎన్నికల్లో నిరూపించాయి.ఎన్నికల గణాంకాల్లో ఆరితేరిన మోదీ, అమిత్ షా ద్వయం ప్రతిపక్షాల ఐక్యతా సవాలును ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరంగా మారింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు