“స్టూడెంట్” ని కోరిక తీర్చమన్న “ప్రిన్సిపాల్”..కాదందని ఏం చేశాడంటే

దేశంలో ఆడపిల్లలకి రక్షణ కరువవుతోంది.తల్లి కడుపులో ,బయటకి రాగానే తల్లి వడిలో ఉన్నంతవరకీ స్త్రీ కి బద్రత ఉంటోంది.

 Principal Sexual Harassment On Student-TeluguStop.com

చివరికి కన్న తండ్రుల ద్వారా కూడా బాలికలకి రక్షణ కరువవుతోంది.ఆడపిల్లని స్కూల్ కి పంపాలన్నా , భందువుల ఇళ్ళకి పంపాలన్నా సరే భయమే.

పూర్వం వయసు ఈడు వచ్చిన తరువాత పిలల్ని బయటకి పంపే వారు కాదు కానీ ఇప్పుడు రెండేళ్ళు మూడేళ్ళు ఉన్న చిన్న చిన్న పిల్లల పై కూడా అత్యాచారాలు జరుగుతుందే సమాజంలో ఇంకెక్కడా స్త్రీకి భద్రత ఉంటుంది.అయితే తాజాగా జరిగిన సంఘతతో చివరికి చదువు చెప్పే స్కూల్స్ సైతం ఆడపిల్లలకి రక్షణ ఇవ్వలేక పోతున్నాయి.వివరాలలోకి వెళ్తే

విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఒక కీచక గురువు కామాందుదిగా మారిపోయాడు.తన వద్ద చదువుకుంటున్న విద్యార్ధిని లోబరుచుకోవడానికి శతవిధాలా ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు.చివరికి ఏం జరిగిందంటే? విశాఖ జిల్లా ముంచంగిపుట్టులోని గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ నాగసాయి సత్యమూర్తి.ఇంటర్ సెకండియర్ చదువుతున్న బాలికపై కన్నేశాడు.

ఆమెను తన కోరిక తీర్చాలని లైంగికంగా వేధించేవాడు

అంతేకాదు తాను చెప్పినట్టుగా వినకపోతే పరీక్షల్లో ఫెయిల్ చేస్తానని బెదిరించేవాడు.కానీ ఆ విద్యార్థిని ఎంతకూ లొంగకపోవడంతో ఆమె పై తీవ్రమైన కోపం పెట్టుకున్నాడు…అయితే ఆమె మార్చిలో ఒక రాసిన పరీక్షలలో ఒక ప్రశ్నకి కేవలం రెండు మార్కులే రావడంతో విద్యార్థిని తల్లిదండ్రులు రీ వెరిఫికేషన్ చేయించారు.

అయినా సరే అవే మార్కులు వచ్చాయి.అయినా అనుమానం పడిన తల్లి తండ్రులు పరీక్ష పేపర్ ని డౌన్లోడ్ చేసుకుని చూడగా జవాబుపత్రం గత సంవత్సరం సప్లిమెంటరీ తేదీతో ఉంది…అయితే ప్రిన్సిపాల్ పై అనుమానం వచ్చిన ఆమె అతడే ఈ పని చేసుంటాడని భావించి తల్లి తండ్రులకి జరిగిన విషయం చెప్పింది.

దాంతో బాలిక తల్లి తండ్రులు అతడికి దేహ సుద్ది చేశారు.పోలీసులు వివరాలు తెలుసుకుని కేసుని దర్యాప్తు చేస్తున్నారు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube