సోమిరెడ్డి మంత్రి పదవి గోవిందా..!! గోవిందా..!!

నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఆయనది ప్రత్యెక మైన శైలి.మూడు సార్లు వరుసగా చంద్రబాబు టిక్కెట్టు ఇచ్చినా సరే ఓడిపోయారు అయితేనేం తనకి ఉన్న ఆర్ధిక బలం.

 Somireddy Minister Post-TeluguStop.com

అంగబలం ఆయన్ని తిరుగు లేని నాయకుడిగా చేశాయి.నెల్లూరు రాజకీయాల్లో ఇప్పుడు మంత్రిగా చక్రం తిప్పుతున్న ఏకైక వ్యక్తిగా ఆయనకీ మంచి పేరు ఉంది కూడా అయితే గత కొంత కాలం గా నెల్లూరు తెదేపా లో విభేదాలు, గొడవలు అన్ని సోమిరెడ్డి చుట్టూ తిరుగుతున్నాయన్న వార్తలు వస్తున్నాయి.

నెల్లూరు జిల్లాలో చాలా మంది నేతలతో ఆయనకు సఖ్యత లేదని వార్తలు ఇప్పుడు సోమి రెడ్డి తల రాతని మార్చ బోతున్నాయి.


చంద్రబాబు కి అత్యంత సన్నిహితులలో ఒకరైన సోమి రెడ్డి కి చంద్రబాబు ఎమ్మెల్సీ ఇచ్చి ఆపై మంత్రి పదవి కట్టబెట్టంపై ఎంతో మంది నేల్లూర్రు నేతలు అసహనం వ్యక్తం చేశారు.అందుకే ఆయన మీద నెగెటివ్ వార్తలు వస్తున్నాయి అని ఆయన అనుచరులు చెప్తున్నారు.అయితే సోమిరెడ్డి ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్న వర్గానికి ఇప్పుడు బంపర్ అవకాశం దొరికింది.

ఎప్పటి నుంచో సోమి రెడ్డి మంత్రి పదవి నుంచీ తీయించాలని ట్రై చేస్తున్న వర్గానికి ఇదొక మహాద్భుతమైన అవకాశమనే చెప్పాలి

వివరాల్లోకి వెళ్తే, వైకాపా ఎంపీలు చేసిన రాజీనామాలు ఇప్పట్లో ఆమోదం పొందే అవకాశాలు కనుచూపుమేరలో కనిపించడం లేదు.ఒక వేళ సోమిరెడ్డి ఖర్మ కాలి గనుకా లోక్‌సభ సభ్యుల రాజీనామాలను ఆమోదించిన అనంతరం ఉప ఎన్నికలు జరిగితే నెల్లూరు లోక్‌సభ సభ్యుడిగా ఇప్పుడు మంత్రిగా ఉంటున్న సోమి రెడ్డి మాత్రమె ఈ పోటీకి సమర్ధుడు అని మహానాడులో కార్యకర్తలు అంటున్నారు.

అంతేకాదు వారిని ఎదుర్కోవాలి అంటే మాజీ మంత్రి ఆదాల కన్నా సోమిరెడ్డి బెటర్ అంటూ ముందుకు తోస్తున్నారట

అయితే జిల్లాలోని మంత్రి గారి వ్యతిరేక వర్గం మాత్రం సోమిరెడ్డి కి ఎంపీ గా పోటీ చేసే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.అయితే ఇదంతా బారీ కుట్ర అని సోమి రెడ్డి వర్గం భావిస్తుంది.

దీనికి కారణాలు లేకపోలేదు.వైకాపా సిట్టింగ్ ఎంపీ సీట్ లో సోమిరెడ్డి ని దించితే ఆయన ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి.

నెల్లూరు జిల్లా స్వతహాగా కాంగ్రెస్ కి కంచుకోట, అక్కడ కేవలం రెండు సార్లు తెలుగుదేశం గెలుపొందింది.గత ఎన్నికల్లో మాత్రం ఆదాల మంచి పోటీ ఇచ్చి 2012 ఉప ఎన్నికల్లో షుమారు మూడు లక్షలు ఉన్న మెజారిటీ ని కేవల్మ్ పదివేలకు కట్టడి చేశారు.

ఒక రకం గా బీజేపీ టీమ్ బి గా ఉన్న వైకాపా మీద కూడా ప్రజల్లో ఆగ్రహం ఉంది, ఆ పది వేల మెజారిటీ కూడా తగ్గిస్తే నెగ్గొచ్చు ఏమో, కానీ అభ్యర్ధి మారుతున్నారు.ఒక వేళా పోటీ లో గెలిస్తే మంత్రి పదవి కి రాజీనామా చెయ్యాలి పైగా ఎంపీ గా ఉండేది కూడా సంవత్సరం కంటే తక్కువ సమయమే.

దాంతో సోమి రెడ్డి కి ఇప్పుడు ఉన్న మంత్రి పదవి పోతుంది ఒక వేళ సోమి రెడ్డి దరిద్రం అడ్డం తిరిగితే.పోటీలో ఓడిపోతే ఉన్నది పాయె ఉంచుకున్నది పాయె అయ్యినట్టే అంటున్నారు.

అయితే ఏది ఎలా ఉన్నా సరే తప్పకుండా సోమిరెడ్డి ని నెల్లూరు లోక్‌సభకు పోటీ చేయించాలని మంత్రి నారాయణ, జిల్లా పార్టీ అధ్యక్షుడు బీదరవిచంద్ర యాదవ్‌తో పాటు కావలి మాజీ ఎమ్మెల్యే మస్తాన్‌రావు కూడా కోరుతున్నారు…ఈ లెక్కల ప్రకారం చూస్తుంటే సోమి రెడ్డి వ్యతిరేక వర్గం ఎప్పుడు సోమి రెడ్డి మంత్రి సీటుకి ఎసరు వస్తుందో అని వేచి చూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube