సడన్ గా "నిఫా వైరస్" విజృంభించడానికి కారణం ఆ "బావి".! అసలేమైందో తెలుస్తే షాక్.!

నిఫా వైర‌స్ ప్ర‌స్తుతం ఇండియాను భ‌యాభ్రాంతుల‌కు గురిచేస్తున్న డేంజ‌ర‌స్ వైర‌స్.కేరళలో అంతుచిక్కని వైరస్‌ మూలంగా అకస్మాత్తుగా పది మంది చనిపోవడంతో యావత్‌ భారతదేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

 Shocking Facts About Nipah Virus-TeluguStop.com

అయితే మృతుల్లో ముగ్గురి మరణానికి కారణం ‘నిపా వైరస్‌’ అని వైద్యులు ధృవీకరించగలిగారు.ఇప్పటిదాకా వినిపించని, కనిపించని ఈ కొత్త వైరస్‌ ఎక్కడిది? రెండు నుంచి నాలుగు రోజుల్లో కోమాలోకి తోసి చంపేసే ఈ వైరస్‌ను నియంత్రించగలమా?నిజానికి నిపా వైరస్‌ కొత్తదేం కాదు.ఈ వైరస్‌తోనే ముగ్గురు కేరళ వాసులు చనిపోయారని పూణేలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ ధృవీకరించడంతో కొన్నేళ్లుగా వినిపించకుండా పోయిన నిపా వైరస్‌ పేరు తిరిగి తెరమీదకొచ్చింది.అరుదైనది, తీవ్రమైనది, ప్రాణాంతకమైనది.

ఈ వైరస్‌ 1998లోనే మలేసియా, సింగపూర్‌లో బయల్పడింది.ఆ సమయంలో 265 మందికి ఈ వైరస్‌ సోకితే, వారిలో ఇన్‌ఫెక్షన్‌ తీవ్రంగా సోకిన 40ు మందిని ఇంటెన్సివ్‌ కేర్‌లో ఉంచి చికిత్స చేసి బతికించారు.అప్పట్లో ఈ వైరస్‌ పందుల్లో కనిపించి, వాటి ద్వారా మనుషులకు వ్యాపించింది.గబ్బిళాలు, పందులు, మనుషులు… వీళ్లలో ఎవరి నుంచి ఎవరికైనా ఈ వైరస్‌ సోకవచ్చు.2004లో ఈ వైరస్‌ సోకిన గబ్బిళాలు ఎంగిలి చేసిన తాటి గుజ్జు తినడం మూలంగా మనుషులకు సోకింది.మన దేశం, బంగ్లాదేశ్‌లో మనుషుల నుంచి మనుషులకు ఈ వైరస్‌ సోకిన దాఖలాలున్నాయి.

ఈ వైరస్‌ గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ కొత్తగా వెలుగులోకొచ్చిన ‘జూనోసిస్‌’ (జంతువు నుంచి మనుషులకు వ్యాపించే వైరస్‌)గా ఇంతకుముందే గుర్తించింది.‘ఫ్రూట్‌ బ్యాట్స్‌’ అనే ఒక రకం గబ్బిళాలు నిపా వైరస్‌కు వాహకాలుగా పని చేస్తాయని కూడా కనుగొన్నారు

అయితే అసలు ఈ వైరస్ ఎక్కడినుండి వచ్చింది? ఎలా వచ్చింది? అనే విషయం ఇప్పుడు బయటకి వచ్చింది.ఈ వైరస్ రావడానికి కారణం ఒక బావి ఆ భావి ముసా అనే వ్యక్తీ ఇంటి వెనుక భాగంలో ఉంది.అయితే ఆ బావిని శుభ్రం చెయ్యవలసి ఉంది ఇక దాన్ని శుభ్రం చెయ్యమని ముసా తన పెద్ద కొడుకుకి చెప్పాడు అతను తన సోదరుల సహాయంతో బావిలోకి దిగి అంత కూడా శుభ్రం చేసాడు తరువాతే అతను నిఫా వైరస్ భారిన పడ్డాడు.

అది తరువాత తన సోదరుడికి అలాగే అతని తల్లి కూడా సోకింది 15 రోజుల వ్యవధిలో ఈ ముగ్గురు కూడా చనిపోయారు.అది ఇక అందరికి కూడా సోకింది ఆ బావిలో ఉన్న గబ్బిలాల ద్వారా ఈ వైరస్ బయటకి వచ్చిందని ‘పూణే లోని నేషనల్ ఇన్స్టిట్యుట్ ఆఫ్ వైరాలజీ’ వెల్లడించింది.

ఇక వెంటనే ఆ బావిని మూసేసారు అలాగే చుట్టూ పక్కల ఉన్న బావులు అన్ని కూడా మూసేసారు నిజం చెప్పుకోవాలి అంటే కేరళలో గబ్బిలాలు ఎక్కువ పైగా ఆ భావి శుభ్రంగా లేకపోయే సరికి ఆ గబ్బిలాలు అన్ని కూడా అందులో నివాసం ఉండి ఈ వైరస్ రావడానికి కారణమయ్యాయి.

ఈ వైరస్ కేరళలోని చందలోద్ గ్రామంలోని ఒకే కుటుంబానికి చెందినా ముగ్గురిని కడుపునా పెట్టుకుంది తరువాత అదే గ్రామానికి చెందినా మరో 12 మంది ప్రాణాలు తీసేసింది.ఇక ఈ వ్యాధి ని అరికట్టేవారు ఎవ్వరు లేరు అని గ్రామా వాసులందరూ కూడా భయంతో వణికిపోతున్నారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు.ప్రస్తుతం వైద్యులు ఈ వైరస్ కి మందు కనిపెట్టే పనిలో ఉన్నారు.

చూద్దాం ఈ వైరస్ వల్ల ఇంకెంతమందిప్రాణాలు కోల్పోతారో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube