వైసీపీ నేతలు “అవినీతికి అడ్డాలు”..ఇదేందయ్యా జగనూ

ఏపీలో ఉన్న ఇరు పార్టీల అధినేతలకి తమ తమ పార్టీ నేతలతో పెద్ద చిక్కొచ్చి పడింది.ఒక పక్క నీతులు చెప్తూనే మరో పక్క ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు చేస్తున్న తప్పుడు పనులకి సంధానం చెప్పుకోలేక సైలెంట్ అవుతున్నారు ఒక వేళ ఎవరిని ఏమన్నా సరే ఎన్నికల సమయంలో ఎక్కడ తిరుగుబాటు చేస్తారోననే భయం ఉండనే ఉంది.

 Ysrcp Leaders Corraption-TeluguStop.com

అయితే ముఖ్యంగా వైసీపిలో ఈ మధ్యకాలంలో సొంత పార్టీ నేతలు ఎమ్మెల్యే భాగోతాల వలన పార్టీ పరువు రోజు రోజు కి మరింతగా దిగాజారిపోతోంది.వివరాలలోకి వెళ్తే.

ప్రజల నుంచీ దోపిడీ కొందరు అవినీతి అధికారులు దోపిడీ చేస్తున్న అవినీతి సొమ్ముకి వైసీపి నేతలు కొమ్ము కాస్తున్నారు అంటూ వస్తున్న వార్తలు గత కొంతకాలంగా మనం వింటూనే ఉన్నాము.పోలీసు వర్గాలు, అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ).క్రికెట్‌ బెట్టింగ్‌లతో జనాన్ని కొల్లగొడుతోన్న బుకీలకు నెల్లూరు రూరల్‌ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అండగా నిలిచారని ఆ జిల్లా ఎస్పీ మీడియా సాక్షిగా చెప్పిన మాటలు వైసీపి ని ఓ కుదుపు కుదిపేశాయి.ఇదిలాఉంటే.

నిన్న అనంతపురం జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అన్న కుమారుడు కాంట్రాక్టరును డబ్బు కోసం కిడ్నాప్‌ చేయడం.కూడా వైసీపిలో కలకలం సృష్టించింది అయితే తాజాగా ఏసీబీ కేసు దర్యాప్తులో గుంటూరు జిల్లా మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పాత్ర వెలుగులోకి రావడం ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా సంచలనం అయ్యింది.

రాజధాని ప్రాంతంలో అవినీతిపరుడి గా ఆరోపణలున్న పోలీసు అధికారి ఏసీబీ కేసులో ఇరుక్కుని సస్పెండ్ అయ్యాడు.అయితే ఆదాయానికి మించి ఉన్న ఆస్తుల వివరాలు సేకరిస్తున్న సమయంలో తుళ్లూరు ప్రాంతంలో కొన్ని స్థిరాస్తులు ఇతరుల పేర్లతో ఉన్నట్లు బయటపడింది.

అయితే ఈ ఆస్తుల విషయంలో ఆరాతీయగా బినామీలలో మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి భార్య పేరు ఉన్నట్లుగా తేలింది…దాంతో ఏసీబీ అధికారులు ఆయనకు బుధవారం నోటీసు ఇచ్చారు…ఈ నెల 22న విజయవాడలోని ఏసీబీ ప్రధాన కార్యాలయానికి వచ్చి వివరాలు వెల్లడించాలని ఆదేశించారు…అయితే ఇంతటి అవినీతి పరుడు అయిన ఆ లంచావతారానికి వైసీపి ఎమ్మెల్యే ఆళ్ళ కి మధ్య ఆర్ధిక లావా దేవీలు ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఒక పక్క ప్రజారంజకమైన పాలన అందిస్తాను అవినీతిని అంతమొందిస్తాను అంటూ జగన్ చెప్తుంటే తన పార్టీ నేతలు వెనుకాల ఇలాంటి అవినీతి మరకలు అంటించుకోవడం పార్టీ కి డ్యామేజ్ అంటున్నారు విశ్లేషకులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube