వామ్మో పవన్ మామూలోడు కాదు ! రాజకీయం నేర్చేసాడు

పవన్ కి రాజకీయాలు ఏమి తెలుసు .? అతనో రాజకీయ అజ్ఞాతవాసి అంటూ విమర్శలు గుప్పించిన వారి నోళ్లు మూతపడేలా పవన్ తన కొత్త రాజకీయం చూపిస్తున్నాడు.అందుకే అయన వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాడు.సామాజికంగా, ఆర్ధికంగా బాగా వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాను తన యాత్రకు ముందుగా ఎంపిక చేసుకున్నాడు.స్థానిక సమస్యలను ఎక్కడికక్కడ ప్రస్తావిస్తూ ప్రజల్లోకి చొచ్చుకెళ్తున్నాడు.జనసేన పుట్టింది జనం కోసమేనని, సామాన్యుల కష్టాలను తీర్చేందుకు జనసేన ప్రభుత్వం అవసరమనే సందేశాన్ని ప్రజల్లో కి బలంగా తీసుకెళ్లాలన్న తన ప్లాన్ చక్కగా అమలు చేసుకుంటున్నాడు.

 Pawan Kalyan A Complete Politician-TeluguStop.com

పవన్ ‘పోరాటయాత్ర’లో భాగంగా సోమవారం శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.ఇచ్ఛాపురంలో జనసేన కార్యకర్తల సమావేశంలో వారికి దిశానిర్దేశం చేశారు.విద్య, వైద్య రంగాల్లో ప్రభుత్వ సేవలు శూన్యమవుతున్నాయని ధ్వజమెత్తారు.అలాగే .సహజ వనరులు, పర్యావరణాన్ని ధ్వంసం చేస్తే తిండి, నీరు దొరకదని.ఇప్పటికైనా ప్రభుత్వాలు నిర్ణయాలు మార్చుకోవాలని సూచించారు.

గతంలో బీల ప్రాంతంలో థర్మల్‌ వ్యతిరేక ఉద్యమంలో అమరులైన వారి స్థూపం వద్ద పవన్‌ నివాళులర్పించారు.బాధిత కుటుంబ సభ్యులతో, గాయపడిన వారితో మాట్లాడారు.

ఇలా ఎక్కడికక్కడ సందర్భాన్ని బట్టి పవన్ స్పందించడం ఆయనలో రాజకీయ పక్వత పెరిగినట్టు అర్ధం అవుతోంది.

చేరికలపై పవన్ దృష్టి ….

ఎన్నికల సమయం సమీపిస్తుండడంతో పార్టీలో చేరికలు పెంచుకుని బలమైన అభ్యర్థులకు టికెట్లు ఇచ్చి గెలిపించుకోవాలని పవన్ ప్లాన్ చేసుకుంటున్నాడు.ఇప్పటికే పాదయాత్ర చేపట్టిన జగన్ కూడా ఇదే ఫార్ములా అమలుచేస్తున్నాడు.

దీంతో జగన్ పాదయాత్ర లో చేరికలు పెరిగి ఆ పార్టీకి ప్లస్ అవుతోంది.ఇప్పుడు పవన్ కూడా ఇదే ఫార్ములా అమలుచేస్తుండడం వల్ల వైసీపీ లోకి వెళ్లే చేరికలు జనసేన వైపు మళ్లుతాయని పవన్ ప్లాన్.

ఇప్పటికే చాలామంది పవన్ సామజిక వర్గం నాయకులు జనసేనలో చేరేందుకు సిద్ధం అవుతున్నారు.వీరితోపాటు అన్ని సామజిక వర్గాలకు చెందిన బలమైన నాయకులను సిద్ధంచేసుకుని ఎన్నికల బరిలో దిగాలని పవన్ ఆలోచన.

ఈ క్రమంలోనే.శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఇచ్ఛాపురం మాజీ ఎమ్మెల్యే నరేష్ కుమార్ అగర్వాలా (లల్లూ) జనసేనలో చేరుతున్నట్టు తెలుస్తోంది.ప్రస్తుతం పవన్ యాత్ర ఇచ్చాపురం నియోజకవర్గంలోనే ఉంది.ఈ క్రమంలోనే లల్లూ జనసేనలో చేరే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఇచ్ఛాపురంకు చెందిన ఆయన 2004లో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా విజయం సాధించారు.ఆయన జనసేనలో చేరే అంశంపై ఆసక్తిగా ఉన్న విషయాన్ని పవన్ చెవిన వేసారు ఆయన సన్నిహితులు.

దీనికి పవన్ కూడా ఒకే అనడంతో కొద్దిరోజుల్లోనే ఆయన జనసేనలో చేరే అవకాశం కనిపిస్తోంది.ఇదే జరిగితే జనసేన ఇచ్ఛాపురం అభ్యర్థి రెడీ అయినట్టే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube