రక్త హీనత సమస్యతో బాధపడుతున్నారా... అయితే ఈ ఆహారాలు మీ కోసమే

మన శరీరంలో సరిపడా రక్తం లేకపోతే రక్తహీనత ఏర్పడుతుంది.అలాగే శరీరంలో తగినంత ఐరన్ లేకపోవటం మరియు విటమిన్స్ లోపం కారణంగా కూడా రక్తహీనత సమస్య ఏర్పడుతుంది.

 Effective Tips To Get Rid Of Anemia-TeluguStop.com

ఈ మధ్య కాలంలో మన దేశంలో రక్తహీనతతో బాధపడేవారి సంఖ్య బాగా పెరుగుతుంది.ఈ సమస్య అధికంగా స్త్రీలలో కనపడుతుంది.

సరైన పోషకాహారం తీసుకోకపోవటం వలన చిన్న పిల్లలలో కూడా ఈ సమస్య ఎక్కువగా కనపడుతుంది.అయితే ఈ సమస్యకు పరిష్కారం ఏమిటా అని ఆలోచిస్తున్నారా? అయితే మన ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుంటే సరిపోతుంది.వాటి గురించి తెలుసుకుందాం.

తాజా ఆకుకూరలు ముఖ్యంగా తోటకూర, పుంటి కూర‌, పాలకూర, మెంతి కూర వంటి వాటిలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది.అందువల్ల ప్రతి రోజు ఆహారంలో ఒక ఆకుకూర ఉండేలా చూసుకోవాలి.

అలాగే బాదం, జీడిపప్పు, ఎండు ఖర్జూరాల‌లో కూడా ఐరన్ సమృద్ధిగా ఉంటుంది.

వీటిని కూడా ప్రతి రోజు తీసుకోవాలి.

విటమిన్ సి సమృద్ధిగా లభించే నిమ్మ, ఉసిరి, జామ వంటి పళ్ళు మరియు మొలకెత్తిన పప్పుధాన్యాలు తీసుకుంటూ ఉంటే రక్తహీనత నుండి బయట పడవచ్చు.

సొయా బీన్ ఎక్కువగా తీసుకుంటే శరీరం పోషకాలను గ్రహించే శక్తి పెరుగుతుంది.దాంతో మనం తీసుకున్న ఆహారంలోని ఐరన్ ని శరీరం బాగా గ్రహిస్తుంది.

బీట్ రూట్ లో ఐరన్, ప్రొటీన్‌లు,విటమిన్ ఏ సమృద్ధిగా ఉంటాయి.అందువల్ల రక్తహీనతతో బాధపడేవారు బీట్ రూట్ ని తరచుగా తీసుకుంటే ఆ సమస్య నుండి బయట పడవచ్చు.

తేనెలో ఐరన్, కాపర్, మాంగనీస్ లు సమృద్ధిగా ఉండుట వలన రక్త హీనత నుండి కాపాడుతుంది.కాస్త నీరసంగా అనిపిస్తే ఒక గ్లాస్ నీటిలో రెండు స్పూన్ల తేనే కలుపుకొని త్రాగితే వెంటనే రిలాక్స్ అవుతారు.

అయితే మధుమేహం ఉన్నవారు మాత్రం తేనే తీసుకోకూడదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube