మార్కెట్ లోకి పతంజలి సిమ్ కార్డ్ లు .. సిమ్ తీసుకుంటే 5 లక్షల ఆఫర్..

యోగ గురువు బాబా రాందేవ్ ప‌తంజలి పేరుతో సంస్థ‌ను స్థాపించి దేశీయ ఉత్పత్తులు చేస్తూ మంచి బ్రాండ్ ని సంపాదించుకుంది.అయితే ఇప్పుడు ఆయ‌న టెలికాం రంగంలోనూ అడుగుపెట్టేందుకు సిద్దం అయ్యారు.

 5 Lakhs Offer For Pathanjali Sim Cards-TeluguStop.com

స్వ‌దేశీ స‌మృద్ధి సిమ్ కార్డులంటూ ప‌తంజ‌లి సిమ్ కార్డుల‌ను అట్ట‌హాసంగా లాంచ్ చేశాడు.ఇందుకోసం ప్రభుత్వరంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(BSNL)తో ఒప్పందం చేసుకున్నారు.

ఈ రెండు సంస్థలు కలిసి స్వదేశీ-సమ్‌రాధి సిమ్‌కార్డులను మార్కెట్లోకి విడుదల చేయబోతున్నాయి.

పతంజలి సిమ్


పతంజలి సంస్థ అందించే సిమ్‌కార్డుతో కేవలం రూ.144తో రీఛార్జి చేసుకుంటే దేశవ్యాప్తంగా అపరిమిత కాల్స్ చేసుకోవచ్చని, 2జీబీ డేటా ప్యాక్‌తో పాటు 100ఎస్సెమ్మెస్‌లు కూడా పంపుకునే వీలుందని పేర్కొన్నారు.మొద‌ట‌గా ఈ సిమ్ కార్డుల‌ను పతంజలి సంస్థకు చెందిన ఉద్యోగులు, అధికారులు మాత్రమే వాడ‌నున్నారు.

ఆ త‌ర్వాత మ‌రికొద్దిరోజుల్లోనే అంద‌రికీ అందుబాటులోకి వస్తాయని తెలిపారు.పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ కార్డు ఉపయోగించి వినియోగదారులు పతంజలి ఉత్పత్తులపై 10 శాతం డిస్కౌంట్ కూడా పొందవచ్చని తెలిపారు

ఆరోగ్య , ప్రమాద భీమా


అంతే కాదు, ప‌తంజ‌లి సిమ్ కార్డులు వాడే వినియోగ‌దారుల‌కు 2.5 ల‌క్ష‌ల నుంచి 5 ల‌క్ష‌ల వ‌ర‌కు ఆరోగ్య‌,ప్ర‌మాద‌,జీవిత బీమాను కూడా ప్ర‌జ‌ల‌కు అందిస్తామ‌ని బాబా రాందేవ్ తెలిపారు.దేశ‌సంక్షేమం కోసం స్వ‌దేశీ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ తో చేతులు క‌లిపామ‌ని,మా ఇద్ద‌రి ఉద్దేశం ఒక‌టేన‌ని స్ప‌ష్టం చేశారు రాందేవ్ బాబా.

ఇప్ప‌టివ‌ర‌కు టెలికాం రంగంలో అనేక నెట్ వ‌ర్క్ కంపెనీలు వ‌చ్చాయి.కానీ ప‌తంజ‌లి మాదిరిగా బీమాకు క‌నెక్ట్ చేసే సిమ్ కార్డులు మాత్రం ఇప్ప‌టివ‌ర‌కు రాలేదు.లేటుగా వ‌చ్చినా,లేటెస్టుగా వ‌చ్చామంటూ ఎంట్రీ ఇచ్చిన రిల‌యెన్స్ జియో దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది.అన్నీ ఫ్రీ అంటూ ఏడాది పాటు ఉచిత ఆఫ‌ర్ల‌తో ఉర్రూత‌లూగించిన జియో అన్ని నెట్ వ‌ర్క్ కంపెనీల‌ను భారీగా దెబ్బ‌తీసింది.

ఇక పతంజలి సిమ్ ల హవా ఎలా ఉంటుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube