బర్త్ డే అని కొత్త బట్టలు వేసుకొని స్కూల్ కి వెళ్ళింది.! కానీ ఏడుస్తూ ఇంటికొచ్చింది.! స్కూల్ లో ఏమైంది?

చిన్నప్పుడు బర్త్ డే అనగానే ఫస్ట్ మనకి గుర్తొచ్చేది కొత్త బట్టలు.కొత్తబట్టలు వేసుకొని స్కూల్ కి వెళ్లి అందరికి చాకోలెట్స్ ఇవ్వడం చాలా స్పెషల్ గా ఫీల్ అయ్యేవాళ్ళం.

 New Clothes On Birthday-TeluguStop.com

అందులోను అమ్మాయిలకి డ్రెస్ ల పిచ్చి కొంచెం ఎక్కువే కాబట్టి ఆ అమ్మాయి కూడా అలాగే పుట్టినరోజు అని కొత్త బట్టలు వేసుకొని స్కూల్ కి వెళ్ళింది.కానీ స్కూల్ కి వెళ్ళగానే ఆ సంతోషం ఆవిరైపోయింది.అసలేమైంది అనుకుంటున్నారా? వివరాలు మీరే చూడండి!

స్నేహితులకు చాక్లెట్లు ఇద్దామంటూ సంతోషంగా స్కూల్‌కు వెళ్లింది.కానీ.స్కూల్ యాజమాన్యం మాత్రం కర్కశంగా వ్యవహరించింది.స్కూల్‌ డ్రస్‌ వేసుకు రాలేదంటూ.విద్యార్థిని బయటే నిలబెట్టి.జన్మదినాన్ని.

చేదుజ్ఞాపకంగా మార్చింది.సికింద్రాబాద్‌లోని సెయింట్ మేరిస్‌ స్కూల్‌లో జరిగిన ఈ ఘటన.తీవ్ర కలకలం రేపుతోంది.ప్రైవేటు స్కూళ్ల అరాచకాలను బయటపెడుతోంది.

ఆ అమ్మాయి పేరు రితిక.సెయింట్ మెరిస్ స్కూల్‌లో 8వ తరగతి చదువుతోంది.బర్త్ డే కావడంతో.స్కూల్ కు సివిల్ డ్రెస్ లో వెళ్లింది.ఫాదర్ ఆశీర్వచనాలు కోసం వెళ్లిన రితికాను ఫాదర్ బయటికి పంపించాడు.యూనిఫాం లేనందున చాక్లెట్స్ పంచడానికి వీల్లేదంటూ చెప్పాడు.

పుట్టిన రోజని.చాక్లెట్లు పంచేవరకూ పర్మిషన్‌ ఇస్తే.

తర్వాత డ్రస్‌ మార్చేస్తామని రితిక తండ్రి డేవిడ్‌ ప్రాధేయపడ్డారు.అయినా.

ఆ ఫాదర్‌ మనసు కరగలేదు.దీంతో.

బర్త్‌డే రోజు.ఏడుస్తూ స్కూల్‌ బయటే ఉండిపోవాల్సి వచ్చింది.

యాజమాన్యం తీరుపై మీ స్పందన ఏంటి?

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube