ప్రాణాలు తీసిన వాట్సప్ గ్రూప్..

సోషల్ మీడియాలో స్వేఛ్చ పేరుతో పెట్రేగి పోతున్న దారుణాలు అన్నీ ఇన్నీ కావు.ఒక కులాన్ని ఒకడు దూషిస్తే అదే కులాన్ని మరొకడు కించపరుస్తూ ఇది మా స్వేఛ్చ అని చెప్పుకుంటూ మత విద్వేషాలు.

 Watsapp Chat Killed Man-TeluguStop.com

కుల చిచ్చులు రేపుతూ ఒకరిని ఒకరు చంపుకునే స్థాయికి వెళ్ళిపోయింది అయితే తాజాగా చండీగఢ్ లో జరిగిన ఒక సంఘటన ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ దారునాలకి పరాకాష్టగా నిలిచింది.

వాట్సప్ గ్రూప్ లు పెట్టుకని వాటిలో జరిగే సంభాషణ వలన ఒకరిని నొచ్చుకుని మహా అయితే గ్రూప్ నుంచీ బయటకి వచ్చేస్తారు కానీ ఎక్కడా లేని విధంగా గ్రూప్ లో వచ్చిన చిన్న గొడవ కారణంగా ఏకంగా గ్రూప్ లో ఉన్న సభ్యుడినే హత్య చేసేశారు.చాలా లేటుగా వెలుగు చూసిన ఈ దారుణం హర్యానాలో చోటుచేసుకుంది.వివరాలలోకి వెళ్తే

హర్యానాలోని సోనిపట్‌ నగరంలో స్వర్ణకారుడిగా పనిచేస్తున్న దినేష్‌ కుమార్‌, నగరంలోని తోటి స్వర్ణకారులందరికీ కలిపి ‘జోరి’ పేరుతో ఒక వాట్సప్‌ గ్రూపు ఏర్పాటు చేశాడు.

దినే్‌షకు, గ్రూప్‌లో ఉన్న లవ్‌ కుమార్‌ అనే వ్యక్తికి మధ్య మొదలైన చర్చలు చివరికి ఇంటికి రా చూసుకుందాం అనే స్థాయికి చేరుకున్నాయి.దీంతో లవ్‌ కుమార్‌ తన సోదరులతో కలిసి దినేష్‌ ఇంటికి వెళ్లాడు.

అప్పటికే తన స్నేహితులతో సిద్ధంగా ఉన్న దినేష్‌, లవ్‌ కుమార్‌ను అతని సోదరులను చితకబాదాడు

లవ్‌కుమార్‌ అక్కడికక్కడే మరణించగా.మిగిలిన వారు చావు దెబ్బలతో తప్పించుకున్నారు.ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి వచ్చే లోగానే దినేష్ అక్కడి నుంచీ పారి పోయాడు.కేసుని నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు…అయితే ఇప్పటికే ఇద్దరు నిందితులు దొరికారని ప్రధాన నిందితుడు అయిన వాట్సప్ గ్రూప్ అడ్మిన్ దినేష్ ఇంకా పరారీలో ఉన్నాడని త్వరలో అతడిని కూడా పట్టుకుంటామని తెలిపారు పోలీసులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube