నాగబాబు గారు కాపాడండి : సూర్య బాధితులు

రామ్‌ చరణ్‌, జెనీలియాతో ‘ఆరంజ్‌’ చిత్రాన్ని నిర్మించిన నాగబాబు ఆ నష్టాల నుండి దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత కాని బయట పడలేక పోయాడు.‘ఆరంజ్‌’ చిత్రంతో నాగబాబు పనైపోయిందని అంతా భావించారు.

 Nagababu Produced Naa Peru Surya-TeluguStop.com

పవన్‌ కళ్యాణ్‌తో పాటు ఇంకా కొందరు సాయంగా నిలవడంతో మళ్లీ నాగబాబు నిలదొక్కుకున్నాడు.ఇలాంటి సమయంలో నాగబాబుకు మంచి చేయాలనే ఉద్దేశ్యంతో అల్లు అరవింద్‌ ఒక సినిమా నిర్మాణ బాధ్యతను అప్పగించాడు.

అల్లు అర్జున్‌ డేట్లను నాగబాబుకు ఇచ్చాడు.తక్కువ పారితోషికం తీసుకుని నాగబాబు కోసం ‘నా పేరు సూర్య’ చిత్రాన్ని చేయడం జరిగింది

అల్లు అర్జున్‌ డేట్లు ఉన్న నాగబాబు సొంతంగా కాకుండా లగడపాటి శ్రీధర్‌తో కలిసి ఈ చిత్రాన్ని నాగబాబు నిర్మించాడు.పెద్దగా పెట్టుబడి పెట్టకుండా నాగబాబు సినిమాలో భాగస్వామి అవ్వడంతో నష్టం వచ్చినా, లాభం వచ్చినా పెద్దగా ప్రభావం పడకుండా జాగ్రత్త పడ్డాడు.సినిమాకు వచ్చిన టాక్‌ నేపథ్యంలో విడుదలకు ముందే నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చి పెట్టింది.

ఈ చిత్రం వల్ల నాగబాబుకు దాదాపు 25 కోట్ల వరకు లాభం దక్కినట్లుగా సమాచారం అందుతుంది.సినిమా సక్సెస్‌ అయ్యి ఉంటే మరో పది కోట్ల వరకు లాభాలు వచ్చేవి.కాని సినిమా నిరాశ పర్చడం జరిగింది

సినిమాపై ఉన్న అంచనాల నేపథ్యంలో అన్ని ఏరియాల డిస్ట్రిబ్యూటర్లు కూడా భారీ మొత్తానికి ‘నా పేరు సూర్య’ చిత్రాన్ని కొనుగోలు చేయడం జరిగింది.60 కోట్లకు పైగా ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ జరిగింది.కాని సినిమా లాంగ్‌ రన్‌లో కనీసం 25 నుండి 30 కోట్లను కూడా వసూళ్లు చేయడంలో విఫలం అయ్యింది.డిస్ట్రిబ్యూటర్లు 30 కోట్ల మేరకు నష్ట పోయినట్లుగా సమాచారం అందుతుంది.

దాంతో డిస్ట్రిబ్యూటర్లు తమకు న్యాయం చేయాలని నిర్మాతలను అభ్యర్థిస్తున్నారు

డిస్ట్రిబ్యూటర్లకు లగడపాటి శ్రీధర్‌ అందుబాటులో లేకపోవడంతో అంతా కూడా నాగబాబుపై పడుతున్నారు.తమను ఆదుకోవాలంటూ నాగబాబును వారు వేడుకుంటున్నారు.

తాము నష్టపోయిన మొత్తంలో కొంత మొత్తం అయిన తిరిగి ఇప్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు.కాని నాగబాబు మాత్రం అందుకు నో చెప్పినట్లుగా తెలుస్తోంది.

లాభాలు వచ్చి ఉంటే మీరు మాకు అదనంగా ఇచ్చేవారా అంటూ ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది.లగడపాటి శ్రీధర్‌ కూడా అదే మాటమీద ఉన్నట్లుగా తెలుస్తోంది.

తెలుగులో డిస్ట్రిబ్యూటర్లకు సాయం మొదలు పెట్టింది పవన్‌ కళ్యాణ్‌ అనే విషయం తెల్సిందే.అందుకే మెగా బ్రదర్‌ అయిన నాగబాబును డిస్ట్రిబ్యూటర్లు సాయం కోసం ఆశ్రయించారు.

కాని నాగబాబుది పవన్‌ అంత విశాలమైన మనసు కాదని నిరూపితం అయ్యింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube