“తెలుగు” అధికారికి “ఐరాస” అరుదైన గౌరవం

అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థ ఐక్యరాజ్యసమితి.ప్రపంచ దేశాలకి వారధిగా దేశాల మధ్య సమస్యలు వచ్చినప్పుడు.

 United Nations Respect Telugu Irsofficer-TeluguStop.com

పెద్దన్నగా వ్యవహరిస్తూ సామరస్య ధోరణితో అందరూ ఉండేలా మధ్యవర్తిత్వం చేస్తుంది.ఐక్యరాజ్య సమితి ప్రపంచదేశాల శాంతిని కోరుకుంటూ…ఎన్నో దేశాలలో సేవాకార్యక్రమాలు చేపడుతుంది.

మహిళల సాధికారత మరియు మహిళల అభ్యున్నతి కోసం.అనాధ పిల్లల సంరక్షణ మొదలగు అంశాలపై ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ప్రపంచ దేశాల శాంతిని కోరుకుంటుంది.

అయితే తెలుగు వాడైనా ఉన్నతమైన ఐఆర్‌ఎస్‌ అధికారి ఎన్‌.అశోక్‌బాబుకు అరుదైన గౌరవం దక్కింది.థాయ్‌లాండ్‌లో ఐక్య రాజ్య సమితి (ఐరాస) ఆధ్వర్యంలో బుధవారం నుంచి నాలుగు రోజుల పాటు జరగనున్న బుద్ధ జయంతి సమ్మేళనానికి అశోక్ పరిశీలకుడిగా చేయనున్నారు.ఇదిలాఉంటే ఈ ఘనత సాధించిన తెలుగు వ్యక్తిగా అశోక్ రికార్డ్ సృష్టించారు.

ఈ సందర్భంలో అశోక్ ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియా గుటెరస్‌, థాయ్‌లాండ్‌ రాజు మహావజిరలాంకో, ఇతర అధికారులతో సమావేశం కానున్నారు.సమ్మేళనంలో ఆయన ‘మనవాళి అభివృద్ధి – బుద్ధిజం పాత్ర’ అనే ప్రధాన అంశంపై ప్రసంగించనున్నారు.

అశోక్‌ బాబు ప్రస్తుతం ముంబైలో ఆదాయపు పన్ను శాఖ సంయుక్త కమిషనర్‌గా పనిచేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube