టీడీపీ లోకి ఉత్తరాంధ్ర “సీనియర్స్”..వైసీపిలో టెన్షన్

తెలుగుదేశం పార్టీ ఏపీ ప్రజలని విస్మరించింది.హోదా విషయంలో కేంద్రం మెడలు వంచలేక పోయింది ఇక మేమే కేంద్రానికి సరైన మొగుళ్ళం మాతోనే ఏపీ కి ప్రత్యేక హోదా వస్తుంది అంటూ తెగ డాంభికాలు పోయిన వైసీపి అధినేత జగన్ మోహన్ రెడ్డి కి తాజాగా జరుగుతున్న సంఘటనలు మింగుడు పడటం లేదు.

 Chandrababu Naidu Game Start In Uttarandhra-TeluguStop.com

తెలుగుదేశం పార్టీ రోజు రోజుకి ప్రజలలో అమితమైన అభిమానాన్ని సంపాదించుకుంటూ ఉంటే మరొక వైపు ప్రజలలో టిడిపి ప్రభుత్వాన్ని ఎలా డ్యామేజ్ చేయాలో వైసీపి అలోచిస్తోంది తప్ప ప్రజా సమస్యలపై గానీ, పత్యేక హోదా విషయంలో కానీ కేంద్రంలో పోరాటం చేసింది లేదు.

ఇదిలాఉంటే మరో పక్క జగన్ ఆత్మ అయిన విజసాయి రెడ్డి తాజాగా మాట్లాడుతూ టిడిపి ఎమ్మెల్యేలు 10 నుంచీ 20 మంది వరకూ మాతో టచ్ లో ఉన్నారు త్వరలో వారిలో ఒక్కొక్కరుగా వైసీపిలోకి వచ్చేస్తారు అంటూ ప్రకటన విడుదల చేశారు.

అయితే ఇక్కడ మాత్రం సీన్ రివర్స్ అయ్యింది.తెలుగుదేశం పార్టీలోకి ఉత్తరాంధ్రలో వైసీపి సీనియర్ నాయకులు కొంతమంది వస్తున్నారు సదరు నేతలని టిడిపి ఆహ్వానం కూడ పంపింది.

అయితే టిడిపిలోకి వీరి చేరిక వైసీపికి ఉత్తరాంధ్ర లో కోలుకోలేని దెబ్బ అవుతుందని అంటున్నారు విశ్లేషకులు.ఇంతకీ ఆ నేతలు ఎవరు అంటే.

‘దాడి వీరభద్రరావు’ .‘కొణతాల రామకృష్ణ, సబ్బంహరిలు ఈ ముగ్గురిని తెలుగుదేశం పార్టీ లోకి చేర్చుకోవాలని అధిష్టానం నిర్ణయం తీసుకుని 2014 ఎన్నికలకు ముందు…చంద్రబాబు తన ఎమ్మెల్సీ పదవికి రెవిన్యువల్‌ ఇవ్వలేదని…’దాడి’ టిడిపిని వీడి వైకాపాలో చేరారు…అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా తరుపున ఆయన కుమారుడు పోటీ చేసి ఓడిపోయారు.తరువాత…’దాడి’ కుటుంబం రాజకీయంగా సైలెంట్ అయ్యింది.అయితే వైసీపి లో తీవ్రమైన అసంతృప్తితో ఉన్న ఆయన మళ్ళీ టిడిపిలోకి వెళ్ళడానికి నిర్ణయం తీసుకున్నారు.

.ఇదిలాఉంటే వైఎస్ కి అత్యంత సన్నిహితులు అయిన ‘కొణతాల రామకృష్ణ, సబ్బం హరిలు కూడా టిడిపిలో చేరడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.రాజశేఖర్‌రెడ్డి మరణం తరువాత…’కొణతాల’ ‘జగన్‌’ ను సమర్థించి…ఆయన వెన్నంటి ఉన్నారు.అయితే…తరువాత…’జగన్‌’ కొణతాలను చిన్నచూపు చూడడంతో…ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చారు.తరువాత తటస్థంగా ఉన్న కొణతాల టిడిపి లోకి వెళ్ళాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.ఇక మరో నేత ‘సబ్బంహరి’ రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ.కాంగ్రెస్‌పై పోరాటం చేశారు.

అయితే ఆ తరువాత.

జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో…ఆయన టిడిపికి పరోక్షంగా మద్దతు ఇచ్చారు.ఇప్పుడు రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో ‘చంద్రబాబు’ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందని ప్రకటించి.

ఆ మేరకు మద్దతు ఇచ్చారు…ఇలా ఏకకాలంలో ముగ్గురు బలమైన ఉత్తరాంధ్ర నేతలు టిడిపి లోకి వెళ్ళడం వైసీపి లో గుబులు రేపుతోంది వాస్తవానికి గత కొంత కాలంగా సబ్బం, కొణతాల లని వైసీపిలోకి తీసుకురావాలని జగన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా గతాన్ని దృష్టిలో పెట్టుకున్న వారు మాత్రం ససేమిరా అని చెప్పేశారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube