జనసేనపై “ఆ నలుగురు” టాక్ ఇదే

రాజకీయ నాయకుడు అంటే వ్యూహం, ప్రతి వ్యూహం ,లౌక్యం, చెదరని చిరునవ్వు ,కోపం ఉన్నా సరే వ్యక్తపరచక పోవడం ప్రజాకర్షణ , ప్రజల క్రేజ్ ని ఓట్లుగా మలుచుకోవడం ఇలా ఒకటేమిటి అన్ని విషయాలలో ఆరితేరి ఉండాలి అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం తనకి కొంచం తిక్క ఉంది కానీ దానికో లేక్కుంది అని చెప్తున్నా పవన్ తిక్కకి లెక్క ఎక్కడా కనపడటం లేదనేది బహిరంగ విమర్శ అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి హుందాగా రాజకీయాలు చేస్తుంటే తనకి ఫ్యాన్స్ మద్దతు ఎలా ఉందొ ప్రజా మద్దతు కూడా అలాగే ఉండేదేమో కానీ ఇప్పుడు ఫ్యాన్స్ మద్దతు సైతం ఒక్కో స్టేజి లో తగ్గిపోతోంది.అసలు పవన్ పార్టీ గురించి మాట్లాడుకుంటే

 Janasena Seats-TeluguStop.com

పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ గురించి ఏ నలుగురు మాట్లాడుకున్నా సరే చేస్తున్న వ్యాఖ్యలు ఇవే రాజకీయాలని తన సిద్దాంతాల ప్రాతిపదికన చేస్తానని చెప్పడం సాధ్యమయ్యే విషయం కాదు ఈ విషయంలోనే పవన్ కళ్యాణ్ ఫ్లాప్ అవుతున్నాడని అంటున్నారు మరో ఏడాదిలోనే ఎన్నికలు ఉన్నాయి.ఏపీలో సీఎం పీఠం కోసం పార్టీలు, నేతల మధ్య హోరా హోరీ పోరు సాగనుంది…అయితే ఇలాంటి సమయంలో తాను కూడా అధికార పీఠానికి తక్కువా? అంటూ ప్రజల్లోకి వచ్చిన జనసేనాని పవన్ కళ్యాణ్‌.వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రజల్లో తిరుగుతున్నారు

అసలు పవన్ కళ్యాణ్ కి అభిమానులు మాత్రమె కనెక్ట్ అవుతున్నారు కానీ సాధారణ ప్రజలు ఎక్కడా కనెక్ట్ అవ్వడం లేదు.

అసలు వారి ఊసులోకి పవన్ ధ్యాస రావడం లేదు.పైగా వారి మాటల్లో పవన్ పై రాజకీయాలలో రాక ముందే మంచి అభిప్రాయం ఉందని తెలుస్తోంది…అసలు పవన్ ఏమంటాడో ఏమి చెప్తాడో ఎవరికీ అర్థం కాదు అంటూ పవన్ గాలి తీసేస్తున్నారట.

అంతేకాదు పవన్ కళ్యాణ్ చంద్రబు పై చేస్తున్న ఆరోపణలు కానీ విమర్శలు కానీ, ఆరోపణలు కానీ ప్రజల్లో సగం మందికి కూడా చేరడం లేదట అంటే పవన్ కళ్యాణ్ ని ప్రజలు పట్టించుకోవడం లేదు అనేది వాస్తవం అని అంటున్నారు పరిశీలకులు

అయితే ఈ మొత్త పరిస్థితిని బట్టి చూస్తే పవన్ కళ్యాణ్ పూర్తిగా ఏపీ ప్రజల నాడిని పట్టడంలో విఫలం అయ్యారనే చెప్పాలి…మీడియా ముందుకు వచ్చినా.ఏదో తనలో తను పాఠం చదువుతున్నట్టుగా ఉంటున్న పవన్ వ్యవహార శైలి మాస్‌ను కనెక్ట్ చేయలేకపోతోంది.

అంతేకాదు జనసేనలో ఉండే నాయకులకి ఈ పరిస్థితి అత్యంత సంకటంగా తయారయ్యింది ఎందుకంటే పవన్ కళ్యాణ్ ని నమ్ముకుని మరీ పార్టీ లో చేరిపోయారు ఎంతో మంది.మరి అలాంటి వారికి పవన్ వైఖరి తో తమ భవిష్యత్తు ఏమిటా అనే బెంగ పట్టుకుందట.

దాంతో ఏమి చేయాలో అర్థం కాక తలలు పట్టుకున్తున్నారని టాక్ ఏది ఏమైనా సరే ఎంత స్పీడుగా వచ్చాడో అంటే స్పీడుగా జనసేన కనుమరుగు అయిపోనుంది అంటున్నారు విశ్లేషకులు

ఆయన ఏదో ఒక్క జిల్లాకే పరిమితం కాలేదు.ప్రతి జిల్లాలోనూ పూర్తిస్థాయిలోపర్యటించి ప్రజలను సమీకరించి, పార్టీని నిలబెట్టాడు.

ఇప్పుడు తాజాగా ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్న వైసీపీ అధినేత జగన్ సైతం ఏదో ఒక జిల్లాకు పరిమితం అయిపోలేదు.ఎన్నికలలోపు అన్ని జిల్లాల్లోనూ, అన్ని మండలాల్లోనూ పార్టీని బలోపేతం చేసేందుకు ఆయన కృషి చేస్తున్నారు.

మరి ఆ తరహా స్ఫూర్తి లేనప్పుడు జనసేన ఎప్పుడు మెరుగు పడేను? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.మరి పవన్ ఎప్పుడు వ్యూహం మార్చుకుని ప్రజలకు కనెక్ట్ అవుతాడో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube