జగన్ చెంతకి “రఘువీరా రెడ్డి”

ఏపీలో కీలక పరిణామాలు చాపకింద నీరులా మెల్లగా జరుగుతున్నాయి.ఎంతో మంది సీనియర్ నేతలు వచ్చే ఎన్నికల్లోగా వేరే పార్టీలలోకి జంప్ చేయడానికి సిద్దంగా ఉన్నారు.

 Raghuveera Reddy To Join With Jagan-TeluguStop.com

ముఖ్యంగా ఏపీలో అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ నుంచీ వైసీపిలోకి ఈ వలసలు ఎన్నికల సమయంలో జోరుగా ఉంటాయని అంటున్నారు.అంతేకాదు కేవలం టీడీపి నుంచీ మాత్రమే కాదు కాంగ్రెస్ పార్టీ బీజేపి ల నుంచీ కూడా వైసీపిలోకి సీనియర్ నేతలు క్యూ లు కడుతున్నారని టాక్ జోరుగా వినిపిస్తోంది అయితే ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ కి కోలుకోలేని షాక్ త్వరలో తగలబోతోందని కాంగ్రెస్ కీలక నేత వైసీపిలోకి జంప్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది ఇంతకీ ఆ నేత ఎవరు ఏమిటా కధ అంటే

ఏపీలో కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లోకూడా చావు దెబ్బ తగులుతుందని భావిస్తున్న ఆ పార్టీ ముఖ్యనేతలు ఇప్పుడు ఒక్కొక్కరుగా వైసీపిలోకి మెల్లగా జంప్ అవ్వడానికి రంగం సిద్దం చేసుకున్నారు.అందులో భాగంగానే కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి జగన్ పార్టీలో కి జంప్ అవ్వడానికి సర్వం సిద్దం చేసుకున్నారట…ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న రఘువీరా రెడ్డి వైసీపిలోకి వెళ్ళాలని అనుకోవడమే కాదు ఈ సారి హిందూ పురం నుంచీ ఎంపీగా పోటీ చేయాలని ఆశపడుతున్నట్లు తెలుస్తోంది

ఈ క్రమలోనే రఘువీరా రెడ్డి కర్నాటక ఎన్నికల సమయంలో “జగన్‌” పై విమర్శలు, ఆరోపణలు చేయకపోవడానికి అదే కారణమని కాంగ్రెస్‌ నాయకులు కూడా అనుమానిస్తున్నారు.వై.ఎస్‌కు అత్యంత సన్నిహితుడైన రఘువీరారెడ్డి పదేళ్లపాటు.మంత్రిగా బాధ్యతలు నిర్వహించి.

అనంతపురం జిల్లాలో అధికారం చెలాయించిన విషయం విధితమే.అయితే ఇంతకు ముందే రఘువీరారెడ్డి టిడిపిలో చేర్పించాలని కొందరు టిడిపి నేతలు ప్రయత్నించినా సరే మంత్రి సునీత, అనంతపురం ఎంపి దివాకర్‌రెడ్డి తీవ్రంగా రఘువీరా చేరికని వ్యతిరేకించారు.తాజాగా…కొంత మంది మధ్యవర్తుల ద్వారా ‘జగన్‌’ ‘రఘువీరారెడ్డి’తో మంతనాలు చేయిస్తున్నట్లు తెలిసింది

అంతేకాదు కాంగ్రెస్ అధిష్టానం ఏపీలో పుంజుకోవాలి అంటే తప్పకుండా చరిష్మా ఉన్న నేతలు కావాలని అయితే అందుకు అర్హుడుగా చిరంజీవికి ఆ భాద్యతలు అప్పగించాలని ప్రయత్నాలు చేస్తున్నారట.దాంతో చిన్న బుచ్చుకున్న రఘువీరా వైసీపి వైపు వెళ్ళడానికి జగన్ తో మంతనాలు జరుపుతున్నారని త్వరలో వైసీపి తీర్ధం పుచ్చుకోనున్నారని టాక్ వినిపిస్తోంది.

ఒక వేళ ఇదే గనుకా నిజమైతే ఇప్పటికే అనంతపురం లో ఎంతో బలంగా ఉన్న వైసీపి కి రఘువీరా రూపంలో మరింతగా బలం పెరుగుతుందనేది వైసీపి నేతల భావన.మరి రఘువీర చేరిక ఎంతవరకూ నిజం అవుతుందో వేచి చూడాల్సిందే.

మొదటి నుంచి తండ్రీ,కొడుకులతో సన్నిహితంగా మెలిగిన రఘువీరారెడ్డి ఏదో విధంగా వైకాపాలో చేరి.హిందూపూర్‌ ఎంపిగా పోటీ చేయాలని ఆశపడుతున్నారు.

దానికి ‘జగన్‌’ కూడా ఒప్పుకునే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు…కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుల్లో…ఆంధ్ర రాష్ట్రానికి చెందిన వారికి తమ రాజకీయ భవిష్యత్‌పై గందరగోళం నెలకొనడంతో.ఎక్కువ మంది టిడిపిలో చేరేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తుండగా.

రఘువీరారెడ్డి వైకాపాలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు

చంద్రబాబుతో రాహుల్‌గాంధీ సన్నిహితంగా మెలగడం, సోనియాగాందీ కూడా చంద్రబాబు అవసరాన్ని గుర్తించడంతో.కాంగ్రెస్‌ పార్టీకి రాష్ట్రంలో భవిష్యత్‌ లేదని.ముఖ్యనాయకులే…చంద్రబాబుతో కలిసి మెలసి ఉంటుంటే.తాను ఆ పార్టీలో ఇంకా కొనసాగితే…రఘువీరారెడ్డి…తనకు భవిష్యత్‌ లేదని తెలుసుకుని వైకాపాలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు.

ఇప్పటికే రఘువీరారెడ్డి ‘జగన్‌’తో ఫోన్‌లో మాట్లాడినట్లు చెబుతున్నా.దాన్ని ఎవరూ దృవీకరించలేదు.ఎప్పటికైనా.రఘువీరారెడ్డి వైకాపా తీర్థం పుచ్చుకోవడం ఖాయమని.వైకాపా నాయకులు చెబుతున్నారు.చివరకు రఘువీరారెడ్డి.

వైకాపాలో చేరతారా.? చేరితే…ఎంపీ సీటు ఇస్తారా లేదో చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube