చంద్రబాబే “టార్గెట్”....రాష్ట్రంలో కొత్త “రాజకీయ పార్టీలు”

కేంద్రానికి నిద్రపట్టకుండా చేస్తున్న చంద్రబాబుని ఎలా అయినా సరే ఏపీలో ఓటమి పాలు చేయాలని కేంద్రం పన్నని పన్నాగం లేదు.వైసీపి , జనసేన తో కుమ్మక్కయిన బీజేపి ఇప్పుడు కేవలం చంద్రబాబు టార్గెట్ గా వ్యూహారచనలు చేస్తోంది.

 Bjp Target Chandrababu-TeluguStop.com

కేంద్రం తో డీ అంటే డీ అంటున్న చంద్రబాబు ని ఏపీలో డీ కొట్టే వారి కోసం వెతుకులాటలు చేస్తోంది.అంతేకాదు ఐటీ దాడులు నుంచీ రాజకీయ దాడులు వరకూ అన్నిటిని పక్కా ప్లాన్డ్ గా చేయనునట్టు టాక్ వినిపిస్తోంది.

మొత్తంగా చంద్రబాబు ని ఉక్కిరి బిక్కిరి చేయాలనేది బీజేపి వ్యూహం.


అయితే ఇప్పటికే కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్న ‘మోడీ,అమిత్‌షా’లు ఆ వ్యూహాలను అమలు చేస్తున్నారు.‘జగన్‌’,పవన్‌లతో రహస్య అవగాహన చేసుకున్న బిజెపి పెద్దలు…ఇప్పుడు నియోజకవర్గ స్థాయిలో…’చంద్రబాబు’ను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.అందుకు తగ్గట్టుగానే చంద్రబబాబు ని ఇబ్బంది పెట్టె వారికి ఆర్థిక,నైతిక మద్దతు ఇచ్చి ప్రోత్సహిస్తోంది…తిరుమలలో అపచారం జరిగింది అంటూ ఆరోపణలు చేసిన రమణ దీక్షులని పక్కా ప్లాన్ ప్రకారం బీజేపి పంపిందనేది అందరికి తెలిసిన విషయమే ఇక బిజెపి పెద్దలు.

మరిన్ని వినూత్నమైన మార్గాలకు శ్రీకారం చుట్టారు.


దీనిలో భాగంగా…ఓట్లని కుల ప్రాతిపదికన చీల్చ గలిగే అవకాశం ఉన్న ప్రతీ ఒక్కరిని ఆదరించి వారితో పార్టీలు పెట్టించాలని భావిస్తున్నారు.

అందుకు నిదర్సనమే జనసేన ఈ లిస్టు లోకి జేడీ లక్ష్మీనారాయణ కూడా చేరిపోనున్నారు అని తెలుస్తోంది.అయితే ఆయన్ని బీజేపి లోకి తీసుకుని రావడం కంటే కూడా విడిగానే ఉంటూ పార్టీ పెట్టించి చంద్రబాబు ని దెబ్బకొట్టాలనేది బీజేపి వ్యూహం.

అయితే ఇప్పుడు మరొక వ్యక్తిని అనూహ్యంగా తెరపైకి తీసుకుని వస్తున్నారు గత ఎన్నికల్లో వైకాపా తరువున పోటీ చేసి అరకు ఎంపీ గా ఎన్నికైన కొత్త పల్లి గీత చే పార్టీ పెట్టిన్చాలనేది అమిత్ షా వ్యుహమనే టాక్ వినిపిస్తోంది.


వైసీపి నుంచీ టీడిపి లోకి వెళ్ళిన గీత అక్కడ ఇమడలేక తానూ బిజెపిలో చేరానని ఆ మధ్య చెప్పుకున్నారు.

ఆమె ఏ పార్టీలో ఉన్నా…చివరకు…బిజెపి పెద్దల అడుగులకు మడుగులొత్తే వ్యక్తిగా మారిపోయారు…ఎస్టీ వర్గానికి చెందిన ఆమెతో పార్టీ పెట్టిస్తే…ఉత్తరాంధ్ర కి కొన్ని ఓట్లను చీల్చవచ్చు అనేది బిజెపి పెద్దల ఆలోచనట.టీడీపి కి పడే ఓట్లని గనుకా ఆమె చీల్చ గలిగితే జగన్ కి ఉపయోగపడి చంద్రబాబు కి దెబ్బ అవుతుందని వారి పన్నాగం.

అయితే ఒక వేళ ఈ ప్లాన్ సక్సెస్ అవ్వకపోతే టీడీపీ కి నష్టం కలిగే నేతలని ఇప్పటికి హోల్డ్ లో పెట్టుకుని ఉందట వారితో నైనా సరే పార్టీ పెట్టించే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలలో జోరుగా ప్రచారం సాగుతోంది.అయితే చంద్రబాబు సామాజిక వర్గం నేత ఒకరితోనే పార్టీ పెట్టించి ఆ సామాజిక వర్గం ఓట్లు చీల్చడానికి కూడా పక్కా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది ఏది ఏమినా సరే ఒక్క చంద్రబాబు ని ఓడించడానికి కేంద్రం ముప్పుతిప్పలు పుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube