“చంద్రబాబు కి టార్గెట్ ” ఇచ్చిన పవన్..లేకపోతే “నిరాహార దీక్ష”

పవన్ కళ్యాణ్ ఎండని సైతం లెక్క చేయకుండా చేస్తున్న యాత్ర చూస్తుంటే టీడీపీ ప్రభుత్వాన్ని ఎండగట్టడానికేనని ఏపీ ప్రజలు అర్థం అవుతోంది.శ్రీకాకుళ జిల్లా పర్యటనలో భాగంగా చంద్రబాబు ,టీడీపీ పై నిప్పులు చెరుగుతున్న పవన్ కళ్యాణ్ తన స్పీడుకి బ్రేకులు వేయడంలేదు పలాస ఎమ్మెల్యే అల్లుడిపై సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్.

 Pawan Deadline To Chandrababu-TeluguStop.com

కేవలం టీడీపీ అధినేత చంద్రబాబు ,లోకేష్ లపై మాత్రమే కాదు టీడీపీ నేతలని సైతం టార్గెట్ చేస్తున్నానని చెప్పకనే చెప్పారు.ఇదిలాఉంటే పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

టీడీపీ అధినేత చంద్రబాబు టార్గెట్ పెట్టారు.చంద్రబాబు మీకు 48 గంటలు గడువు ఇస్తున్నాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇంతకీ ఈ 48 గంటలు గడువు ఎందుకు అంటే…రాష్ట్ర ప్రజల ప్రాణాలను పట్టించుకోవడంలో చంద్రబాబు విఫలం అయ్యారు.ఏపీ ప్రజల ప్రాణాలు అంటే అంత చులకనా అంటూ ప్రశ్నించారు.

ప్రజలు తమ సమస్యలను చెప్పుకోడానికి, ఆరోగ్య శాఖ ను పర్యవేక్షించడానికి హెల్త్ మినిస్టర్ లేకపోవడం సిగ్గుచేటని అన్నారు.


అయితే చంద్రబాబు సత్వరమే ఈ సమస్య పై స్పందించి “48 గంటల్లో” హెల్త్ మినిస్టర్ ను నియమించకుంటే యాత్రను ఆపేసి నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు…పలాసలో కిడ్నీ బాధితులతో సమావేశమైన పవన్ ప్రభుత్వంపై ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఉద్దానం కిడ్నీ సమస్యల విషయంలో ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళినా ప్రభుత్వం సరిగా పట్టించుకోలేదని అన్నారు.ఈ సమస్య పరిష్కారానికి నిరాహార దీక్షకు దిగడానికైని సిద్దమేనని హామీ ఇచ్చారు పవన్ కళ్యాణ్.

ప్రభుత్వం ఏపీలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని అన్నారు.ప్రజల కన్నీళ్లు తుడవని అధికారం ఎందుకని పవన్ ప్రశ్నించారు.

ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్త్ సెంటర్స్ లో సేవలు ప్రజలకి అందటం లేదని విమర్శించారు.ఉద్దానం కిడ్నీ బాధితులకు అండగా నిలబడుతున్న డాక్టర్లకు, జనసేన కార్యకర్తలకు పవన్ ధన్యవాదాలు తెలిపారు.

అయితే శ్రీకాకుళం పర్యటన ఆద్యంతం టీడీపీ టార్గెట్ గా జరుగుతోంది అనడంలో సందేహంలేదని ఇది బురద జల్లుడు కార్యక్రమం అని అంటున్నారు టీడీపి నేతలు .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube