ఒక్కడే భారత సైనికుడు, 300 మంది శత్రువులని ఒంటి చేతితో చంపాడు..చరిత్రలో ఎప్పటికి నిలిచిపోయే సైనికుడు..ప్రతి ఒక్క భారతీయుడు తెలుసుకోవాల్సిన స్టోరీ

మన కోసం సరిహద్దుల్లో శత్రువులతో పోరాడి తన ప్రాణం గురించి ఆలోచించకుండా కాపు కాసేవాడే ‘సైనికుడు’.వారిని మనం గౌరవించాలి వాళ్ళు లేకుంటే మనకి రక్షణ లేదు , పిల్ల పాపలను వదిలి స్వార్థం లేకుండా బార్డర్ కి వెళ్లే సైనికులకు మనం ఎప్పుడు కృతజ్ఞతలు చెప్పుకోవాలి , వాళ్లే దేశానికి నిజమైన హీరోలు.
జస్వంత్ సింగ్ రావత్ ఒక ధైర్యమైన రైఫైల్ మ్యాన్.అతను ఉన్న కాలం లో అతనికి మంచి పేరుంది,అతను శరీరంగా , మానసికంగా శిక్షణ పొందాడు.ఇతని ధైర్య సాహసలకు ఇతర దేశ ఆర్మీ సైనికులు కూడా అభిమానించేవారు

 300-TeluguStop.com

1962 లో జరిగిన ఇండో – చైనా యుద్ధం లో రైఫైల్ మ్యాన్ జస్వంత్ సింగ్ పోరాటం అద్భుతం.అది 1962 నవంబర్ యుద్ధం చివరి దశలో ఉంది, తగిన ఆయుధాలు సామగ్రి లేక తనతో పాటు ఉన్న కొంత మంది సైనికులు తప్పుకున్నారు , కానీ ఆ సమయం లో కూడా వెనకంజ వేయకుండా దేశం కోసం ఒక్కడే నిలబడ్డాడు.అప్పటికి ఆయుధాలు లేక చాలా ఇబ్బంది అయింది కానీ అక్కడ దగ్గర ప్రాంతం లో ఉన్న ఇద్దరు అమ్మాయిలు ‘ సేలా , నురా’ ల సహాయం తో పోరాటానికి సిద్ధమయ్యాడు.జస్వంత్ సింగ్ తన తెలివితేటలు ఉపయోగించి మూడు వివిధ చోట్ల ఆయుధాలను అమర్చి కాల్పులు ప్రారంభిచాడు.

దానిని చూసి చైనా ఆర్మీ ముందుకు రాలేకపోయింది.ఇటువంటి ప్రణాళిక ద్వారా చైనీయులకు జస్వంత్ ఒక్కడే ఉన్నాడని తెలియదు.

ఇలా కాల్పులు జరిపి 3 రోజుల పాటు మొత్తం చైనా సైనికులను ముందుకు కదలకుండా చేసాడు

అందుకే జస్వంత్ సింగ్ ని ఒంటరి యోధుడిగా (LONE-WARRIOR) పిలుస్తారు.ఒంటరిగా 3 రోజుల పాటు కాల్పులు జరిపి 300 సైనికులను చంపిన వీరుడు జస్వంత్.

ఇతని ధైర్య సాహసాలు వల్ల అరుణాచల్ ప్రదేశ్ ని అక్రమించుకునేందుకు చైనా చేసిన పోరాటం విఫలం అయిపోయింది.ఇంత కన్నా గొప్ప సూపర్ హీరో భారత్ కి ఎవరుంటారు…

చైనా ఆర్మీ జస్వంత్ సింగ్ ని ఎలా పట్టుకుంది

రోజు రోజు కి ఎక్కువ దాడులు చేసిన జస్వంత్ సింగ్ కోసం చైనా ఆర్మీ వద్ద ఎటువంటి సమాధానం లేదు.

అతని ఎలా అడ్డుకోవలో తెలియక అతని కోసం ఒక వ్యూహం రచించారు.జస్వంత్ సింగ్ కి ఆహారం అందించే వ్యక్తిని పట్టుకొని చస్తావా? లేదా చెప్తావా? అని అడిగే సరికి భయం తో అతని సమాచారం తెలియజేశాడు.ఆ సమాచారంతో చైనా సైనికులు జస్వంత్ సింగ్ ని ముట్టడించారు.చైనా సైనికుల చేతిలో చనిపోవడం ఇష్టం లేక తనను తాను కాల్చుకొని వీరమరణం పొందాడు.అక్కడ జస్వంత్ కి తోడుగా నిలిచిన ఇద్దరు అమ్మాయిలు సేలా , నురా లు కూడా గ్రానైడ్ ఎటాక్ లో చనిపోయారు.జస్వంత్ సింగ్ చనిపోయాక అతని తలను చైనా సైనికులు తీసుకెళ్లారు,తరువాత అతని ధైర్య సాహసాలు గురించి విని గౌరవంగా ఆ వీరుడి తలను వెనక్కి పంపించారు

ఈయన చేసిన ధైర్యానికి, త్యాగానికి గుర్తుగా భారత ప్రభుత్వం ‘మహా వీర్ చక్ర’ అవార్డ్ ను ప్రకటించారు.

జస్వంత్ సింగ్ లాంటి ఎందరో సైనికులు ఇంకా మన ఆర్మీ లో ఉన్నారు, వారి పోరాటాలకు , త్యాగాలను మనం ఎప్పటికి మర్చిపోవద్దు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube