ఏపీలో ఆ ఇద్ద‌రు లేడీ ఫైర్‌బ్రాండ్ల‌కు పొలిటిక‌ల్ క‌ష్టాలు

చిత్తూరు జిల్లాలో ఇటు అధికార టీడీపీ, అటు ప్ర‌తిప‌క్షం వైసీపీ నుంచి కీల‌క రోల్ పోషిస్తున్న ఇద్ద‌రు మ‌హిళ‌ల‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఛాన్స్ క‌ష్ట‌మేన‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.వీరిద్ద‌రు రాజకీయాల్లో లేడీ ఫైర్‌బ్రాండ్‌లుగా ఉన్న వాళ్లే.

 Bad Time For Galla Arun And Roja-TeluguStop.com

వీరిలో టీడీపీ మ‌హిళా మ‌ణి, మాజీ మంత్రి గ‌ల్లా అరుణ‌.ఇప్ప‌టికే తాను రాజ‌కీయాల నుంచి త‌ప్పుకోవాల‌ని భావిస్తున్న‌ట్టు టీడీపీ అధినేత చంద్ర‌బాబుకే స్వ‌యంగా వెల్ల‌డించారు.

దీంతో జిల్లాలో పెను కుదుపు ఏర్ప‌డింది.చిత్తూరు జిల్లా చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన గ‌ల్లా అరుణ.

గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థి చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డిపై ఓడిపోయారు.అయితే.

అప్ప‌ట్లో.అంద‌రూ ప‌నిగ‌ట్టుకుని త‌న‌ను ఓడించార‌ని టీడీపీపై అప్ప‌ట్లోనే ఆమె విరుచుకుప‌డ్డారు.

అయితే, చంద్ర‌బాబు మాత్రం ఆమె సీనియార్టీని గుర్తించి చంద్ర‌గిరి టీడీపీ ఇంచార్జ్‌గా ఆమెనే నియ‌మించారు.

1999, 2004, 2009 ఎన్నిక‌ల్లో వ‌రుస‌గా ఓట‌మి లేకుండా గెలుస్తూ వ‌స్తోన్న ఆమె కాంగ్రెస్ ప్ర‌భుత్వ హ‌యాంలో మంత్రిగా కూడా ప‌నిచేశారు.గ‌త ఎన్నిక‌ల‌కు ముందు ఆమె టీడీపీలోకి జంప్ చేసి చంద్ర‌గిరి బ‌రిలో నిలిచారు.ప్ర‌స్తుతం టీడీపీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌గా ఉన్న ఆమె మాట‌ను దిగువ‌శ్రేణి నాయ‌కులు ఖాత‌రు చేయ‌డం లేదు.

దీనికితోడు అనారోగ్యంతో ఇంటి ప‌ట్టునే ఆమె రెస్ట్ తీసుకుంటున్నారు.దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ అటుంచి త‌న‌ను పార్టీ ఇంచార్జ్‌గా బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించాల‌ని ఆమె చంద్ర‌బాబుకు విన్న‌వించారు.

ఇలా ప‌రిస్థితి యూట‌ర్న్ తీసుకోవ‌డంతో ఇప్పుడు చంద్ర‌గిరి నియొజ‌క‌వ‌ర్గంలో టీడీపీని బ‌లంగా న‌డిపించే వారు క‌రువ‌య్యార‌నే వ్యాఖ్య‌లు వ‌స్తున్నాయి.మ‌రి బాబు న‌చ్చ‌జెప్పి.ఒప్పిస్తే.వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆమె బ‌రిలోకి దిగే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

అయితే, ఇక్క‌డ చెవిరెడ్డి మాత్రం త‌న పంథాలో పావులు క‌దుపుతూ.బ‌లంగా వేళ్లూనుకుంటున్నాడు.

ఈ ప‌రిస్థితిని గ‌మ‌నిస్తున్న‌వారు అరుణ పోటీ చేసినా ప్ర‌యోజ‌నం లేద‌ని చెబుతున్నారు.

ఇక‌, వైసీపీ ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న న‌గ‌రి ఎమ్మెల్యే ఆర్కే రోజా.

ప‌రిస్థితి కూడా తిరోగ‌మ‌నంలోనే సాగుతోంది.ప్ర‌ధానంగా ఆమె త‌మ‌కు అందుబాటులో ఉండ‌డం లేద‌ని ప్ర‌జ‌ల‌కు పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నారు.

రియాల్టీ షోలు చేసుకోవ‌డం, హైద‌రాబాద్‌లో మ‌కాం వేయ‌డం వంటివి ఆమెను నియోజ‌క‌వ‌ర్గానికి దూరం చేస్తున్నాయి.ఇక‌, ప్ర‌భుత్వం స‌హా ప్ర‌భుత్వ అధికారుల‌తో స‌ఖ్య‌త‌గా మెల‌గ‌క పోవ‌డం వ‌ల్ల నియోజ‌క‌వ‌ర్గంలో ఎలాంటి అభివృద్ధీ సాగడం లేదు.

ఇక‌, దీనిని త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకునేందుకు టీడీపీ దివంగ‌త నాయ‌కుడు గాలి ముద్దుకృష్ణ‌మ చేసిన ప్ర‌య‌త్నాలు ఫ‌లించాయి.ఆయ‌న ఉన్న రోజుల్లో ప్ర‌జ‌లకు ఆయ‌న నిత్యం అందుబాటులో ఉండేవారు.

అంతేకాదు, కార్యాక‌ర్త‌ల‌తో రోజు స‌మావేశాలు ఏర్పాటు చేసి .టీడీపీని బ‌ల‌ప‌రిచారు.ఈ క్ర‌మంలోనే త‌న కుమారుడు గాలి భానుప్ర‌కాష్‌ను ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేశారు.దీంతో ఇప్పుడు ప్ర‌జ‌లు త‌మ‌కు ఏ అవ‌స‌రం వ‌చ్చినా.నేరుగా భాను ప్ర‌కాష్ ఇంటికే వ‌స్తున్నారు.ఈ ప‌రిణామాలు రోజాను మ‌రింత ఇర‌కాటంలోకి నెట్టాయి.

ఇదిలావుంటే, ఇటీవ‌ల గాలి మృతి చెంద‌డంతో ఊరు ఊరంతా క‌దిలి వ‌చ్చింది వ‌చ్చే ఎన్నిక‌ల్లో గాలి కుటుంబానికి ఈ టికెట్ కేటాయిస్తే.,.ఖ‌చ్చితంగా సెంటిమెంట్ ఓట్లు మొత్తంగా టీడీపీకి ఖాతాలోకి వెళ్లి రోజా గెలుపు ప్ర‌శ్నార్థ‌కం అయ్యే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.మ‌రి రోజా ఈ గండం నుంచి బ‌య‌ట‌ప‌డ‌డం క‌ష్ట‌మేన‌ని చెబుతున్నారు.

మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube