ఉపఎన్నికలు వస్తే ఆ మూడు టీడీపీ “ఖాతా” లోకే

హోదా కోసం వైసీపి ఎంపీలు చేసిన రాజీనామాల విషయం అందరికీ తెలిసిందే అయితే ఈ వ్యవహారంలో లోక్సభ స్పీకర్ ఇంకా నిర్ణయం తీసుకొనే లేదు అప్పుడు రాష్ట్రంలో ఉపఎన్నికల హడావిడిని మొదలు పెట్టేశారు.అయితే ఒక వేళ రాజీనామాలు ఆమోదించాలి అంటే ఒక సంవత్సరం లోగా ఎన్నికలు నిర్వహించాలి అయితే ఈ ఎన్నికలలో వైసీపి కంటే కూడా టీడీపీ కి గెలుపు అవకాశాలు ఎక్కవగా ఉన్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి.ఈ వివరాలలోకి వెళ్తే

 Ap Tdp Elections-TeluguStop.com

ఏపీ ని వెన్నుపోటు పొడిచి ప్రత్యేక హోదాని తుంగలోకి తొక్కినా బీజేపి తో వైసీపి చెట్టపట్టాలు వేసుకుని తిరుగుతోందని ఇప్పటికే ఏపీ ప్రజలు ఒక అంచనాకి వచ్చేశారు…ఈ నేపథ్యంలో ఎంపీల రాజీనామాలకు ఆమోదం పొంది…ఉపఎన్నికలు వస్తే.వైకాపా పరిస్థితి కష్టంగా ఉంటుందని వారు అంటున్నారు…అయితే జగన్ బీజేపి కలిసి ఆడుతున్న నక్క జిత్తులని ముందుగానే గ్రహించిన చంద్రబాబు జగన్ ని ఏపీ కి ద్రోహం చేసిన బీజేపి లిస్టు లో కలిపేశారు.అదే సమయంలో ఆంద్రుల ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తట్టిలేపుతున్నారు.మరో మారు ఆత్మగౌరవ నినాదం లేవనెత్తిన చంద్రబాబు ఒక వేళ ఉపఎన్నికలు వస్తే ఈ సెంటిమెంట్ ని అక్కడ ఉపఎన్నికల్లో ఉపయోగించాలని అనుకుంటున్నారు

అయితే వైకాపా ఎంపీలు రాజీనామా చేసిన కొన్ని చోట్ల ఆయా ఎంపీల రాజకీయ పరిస్థితి బాగాలేదని అదే సమయంలో ప్రత్యేక హోదా కోసం నిజంగా ఉద్యమాలు చేసి నిరసనలు తెలిపిన తెలుగుదేశం నేతలు పోటీ చేస్తే తప్పకుండా గత ఎన్నికల కంటే కూడా మంచి రిజల్స్ వస్తుందని అంచనా వేస్తున్నారు టీడీపీ నేతలు.

ఒంగోలు, నెల్లూరు, తిరుపతి నియోజకవర్గాల్లో టీడీపి ఎంతో బలపడిందని గతంలో కంటే కూడా ఎంతో పట్టు సాధించిందని ఈ నియోజకవర్గాల్లో టిడిపి గెలుపు…సాధ్యమేనని వారు అంటున్నారు…అయితే ముఖ్యంగా ఒంగోలులో టిడిపి బలంగా ఉందని ఇక్కడ ఈసారి ‘సుబ్బారెడ్డి’ విజయం సాధించలేరని బల్లగుద్ది చెబుతున్నారు టీడీపీ నేతలు సుబ్బారెడ్డి కి సొంత పార్టీ లోని వ్యక్తులే మద్దతు తెలుపడంలేదని అసలు ఎవరిని పట్టించుకోవడం లేదనే కారణంగా ఆయన నాయకత్వాన్ని సొంత పార్టీ నేతలే వద్దనుకున్తున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి

అయితే ఇటువంటి పరిస్థితి నెల్లూరు లో కూడా ఏర్పడింది.ఇక్కడ ‘మేకపాటి రాజమోహన్‌రెడ్డి’ గత ఎన్నికల్లో టిడిపి నేత ‘ఆదాల ప్రభాకర్‌రెడ్డి’పై కేవలం 13వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు.

ఈ సారి టిడిపి తన అంతర్గత సమస్యలను సర్దుబాటు చేసుకుని.పోటీలో నిలిస్తే…’మేకపాటి’ ఘోరమైన పరాజయం ఎదురవ్వడం ఖాయం అంటున్నారు.ఇక తిరుపతిలోనూ అదే పరిస్థితి నెలకొని ఉంది.ఎస్సీ నియోజకవర్గమైన ఇక్కడ…వరప్రసాద్‌ మళ్లీ గెలవలేరని.

ఆయన ప్రజలకు అందుబాటులో లేరనే మాట సర్వత్రా వినిపిస్తోంది.ఇక మరో నియోజకవర్గం ‘కడప’పై మాత్రం టిడిపి ఆశలు వదిలేసుకుంది.

మొదటి నుంచి…వైకాపాకు గట్టిమద్దతు ఉన్న దీనిపై తామేమీ ఆశలు పెట్టుకోవడం లేదని.ఆ జిల్లాకు చెందిన కొందరు నేతలు చెబుతున్నారు…అయితే నిజంగానే ఉపఎన్నికలు వస్తే మాత్రం లాభపడేది మాత్రం టీడీపీ పార్టీ అంటున్నారు విశ్లేషకులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube