పాపం : చక్రీ ఆత్మ క్షోభిస్తోంది

సంగీత దర్శకుడు చక్రి అనుకోకుండా చనిపోవడం భారీ కలకలమే సృష్టించింది.తెలుగు పరిశ్రమ ఆయన చనిపోయి ఏడాదిన్నర కావాస్తున్నా ఇంకా ఆయన్ని మరచిపోలేని పరిస్థితి లో ఉంది.

 Chakri’s Soul Is Not Resting In Peace.-TeluguStop.com

చక్రీ పాటలు ఇప్పటికీ మనకి టీవీ లో ఒస్తుంటే అర్రెర్రే అనిపిస్తూ ఉంటుంది.అలాంటి చక్రీ ఆత్మ ప్రస్తుతం క్షోభ తో బాధపడుతోంది అనిపిస్తోంది.

ఎందుకంటే ఆయన పోయిన ఇన్నాళ్ళ తరవాత కూడా భార్య శ్రావణి – చక్రి తల్లి ల మధ్యన గొడవలు చల్లారలేదు.

చక్రి చనిపోయిన దుఃఖంలో సినీ పరిశ్రమ వుంటే, అప్పుడే చక్రి కుటుంబం (భార్య శ్రావణితోసహా) ఆస్తుల గోలతో రచ్చకెక్కింది.‘ఇప్పుడెందుకు ఈ గోల.’ అంటూ పలువురు సినీ ప్రముఖులు చక్రి కుటుంబంలోనూ, చక్రి భార్య శ్రావణితోనూ మంతనాలు జరిపి, వ్యవహారాన్ని కాస్త కామప్‌ చేయగలిగారు.అప్పటినుంచీ ఇప్పటిదాకా ఆస్తుల వివాదం ఇరు వర్గాల మధ్యా కొనసాగుతూనే వుంది.కానీ చాపకింద నీరు లాగా మీడియా కంట పడకుండా ఈ గోల రోజూ సాగుతూనే ఉంది.

చక్రీ కి చెందిన అపార్ట్మెంట్ లో చక్రి తల్లి చక్రి సోదరుడు ఆందోళన కి దిగిన సంగతి తెలిసిందే.ఆస్తి మీద వారికి మమకారం లేదు అని చెబుతూనే వారు గొడవ చేస్తున్నారు.

కోర్టు లో ప్రస్తుతం కేసు నడుస్తోంది.కోర్టు మీద నమ్మకం ఉన్నవారు సైలెంట్ గా ఉండాలి కానీ గోల చెయ్యడం ఎంటో అర్ధం కాని పరిస్థితి.

సినీ పరిశ్రమలో అంచలంచెలుగా ఎదిగిన చక్రి, సొంతంగా అభిమానుల్ని సంపాదించుకున్నాడు.దురదృష్టవశాత్తూ చక్రి అకాల మరణం చెందాడు.

చక్రి పట్ల సినీ పరిశ్రమలోనూ, ప్రేక్షక లోకంలోనూ అప్పటికీ, ఇప్పటికీ ఎప్పటికీ అభిమానం, ప్రేమ అలానే వుంటాయి.ఇప్పుడు సానుభూతి పెరుగుతోంది.

ఈ వివాదాలు చక్రి ఆత్మకు శాంతి లేకుండా చేస్తాయన్న వాదన ప్రముఖంగా విన్పిస్తోంది.కుటుంబం ఒక్క చోట కూర్చుని చర్చించుకుని పరిష్కరించుకోవాల్సింది పోయి, రచ్చకెక్కితే.‘చక్రి కుటుంబం’ అంటూ వార్తల్లోకెక్కేది చక్రి పేరే.వివాదమయ్యేదీ ఆయన పేరే.

ఆయన లేడు.కానీ, ఆయన పేరుతో వివాదం కొనసాగుతోంది.

ఇంతకన్నా దారుణం ఇంకేముంటుంది.?

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube