రిలీజ్ కు రెడీ అవుతోన్న ‘డార్లింగ్ 2’

ప్రముఖ నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ కె.ఇ.

 Darling2 Is Ready To Release-TeluguStop.com

జ్ఞాన‌వేల్ రాజా ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తమిళ చిత్రం డార్లింగ్ 2.ఈ చిత్రాన్ని వరుణ్ చౌదరి సమర్పణలో ఎవర్ గ్రీన్ క్రియేషన్స్ బ్యానర్ పై తెలుగులో డార్లింగ్ 2 అనే పేరుతోనే విడుదల చేస్తున్నారు.కళైయరసన్, రమీజ్ రాజా, మాయ, కాళి వెంకట్ ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.సతీష్ చంద్రశ్రేఖరన్ దర్శకుడు.మాధురి బొల్లు నిర్మాత.సస్పెన్స్, థ్రిల్లర్, హర్రర్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెన్సార్ కార్యక్రమాలను జరుపుకోడానికి సిద్ధమైంది.

దర్శకుడు సతీష్ చంద్రశేఖరన్ అతని ఐదుగురు స్నేహితలు హాలీడేలో జరిగిన ఘటనను బేస్ చేసుకుని ఈ సినిమాను రూపొందించారు.సెన్సార్ సహా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను మార్చి నెలలో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

కళైయరసన్, రమీజ్ రాజా, మాయ, కాళి వెంకట్, హరి, అర్జునన్, రాందాస్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగతం: రథన్, మాటలు: రాజశేఖర్ రెడ్డి, పాటలు: శివగణేష్, సినిమాటోగ్రఫీ: విజయ్ కార్తీక్ కణ్ణన్, నిర్వహణ: మాధవి, సహ నిర్మాత: షషిత మైనేని, నిర్మాత: మాధురి బొల్లు, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సతీష్ చంద్రశేఖరన్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube