ఇటీవల వచ్చిన ‘కిక్ 2’ సినిమాలో హీరో రవితేజ పేరు రాబిన్ హుడ్.ఇప్పుడీ పేరునే తన తదుపరి చిత్రానికి ఆయన టైటిల్ గా పెట్టుకుంటున్నాడు.
ప్రస్తుతం వేణు శ్రీరాం దర్శకత్వంలో ‘ఎవడో ఒకడు’ అనే చిత్రంలో నటిస్తున్న రవితేజ, దీని తర్వాత చక్రి అనే కొత్త దర్శకుడితో పనిచేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
ఈ చిత్రానికి ‘రాబిన్ హుడ్’ అనే టైటిల్ని ఖరారు చేసినట్టు తాజా సమాచారం.
టైటిల్ని బట్టే ఇది పూర్తి వినోదాత్మక చిత్రంగా రూపొందుతుందని మనం ఊహించవచ్చు.ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్టు వర్క్ తో బాటు ఇతర ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జోరుగా సాగుతున్నాయి.