సరైనోడితో ప్రియమణి రొమాన్స్‌!

అల్లు అర్జున్‌ ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ చిత్రంతో ఫుల్‌ జోష్‌తో ఉన్నాడు.ప్రస్తుతం ఈయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్నాడు.

 Priyamani Item Song In Bunny Boyapati Movie-TeluguStop.com

‘లెజెండ్‌’ వంటి భారీ హిట్‌ తర్వాత బోయపాటి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంపై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి.ఇప్పటికే ఈ సినిమాకు ‘సరైనోడు’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు.

ఈ సినిమాలో బన్నీకి జంటగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెల్సిందే.ఈ సినిమాకు మరింతగా గ్లామర్‌ అద్దేందుకు దర్శకుడ బోయపాటి ఈ సినిమాలో ప్రియమణితో ఐటెం సాంగ్‌ చేయిస్తున్నట్లుగా తెలుస్తోంది.

గత కొంత కాలంగా సినిమాలకు కాస్త దూరంగా ఉంటూ వస్తోంది ఈ అమ్మడు.ఆఫర్లు లేక పోవడంతో, తమిళం మరియు తెలుగులో ఛాన్స్‌ల కోసం తిరిగి తిరిగి ఇక ఛాన్స్‌లు రాక పోవడంతో ప్రియమణి పెళ్లి చేసుకోబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.

ఆ వార్తల సంగతేమో కాని తాజాగా ఈ అమ్మడికి మెగా హీరో సినిమాలో ఐటెం సాంగ్‌ చేసే బంపర్‌ ఆఫర్‌ వచ్చింది.ఈ పాట తర్వాత ప్రియమణి మళ్లీ బిజీ అయ్యే ఛాన్స్‌లు ఉన్నాయి.

హీరోయిన్‌గానే కాకుండా ఐటెం సాంగ్స్‌లో, అతిథి పాత్రల్లో నటించేందుకు తాను సిద్దం అంటూ ఇప్పటికే ప్రియమణి ఓకే చెప్పింది.ప్రియమణికి సరైనోడు మళ్లీ ఆఫర్లు తెచ్చి పెడతాడేమో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube