చంద్రగ్రహణం బాబుకు పదవి గండం

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదవిపై చంద్రగ్రహణ ప్రభావం ఉంటుందని జ్యోతిష్య శాస్త్రవేత్త పులిపాక చంద్రశేఖర సిద్ధాంతి సంచలనమైన వ్యాఖ్యలు చేసారు .ఆయన విజయవాడలోని దుర్గాపురంలో తన కార్యాలయంలో విలేకర్ల తో మాట్లాడుతూ శనివారం కనిపించేది సంపూర్ణ చంద్రగ్రహణమే కానీ భారతదేశంలో పూర్తిగా కాకుండా పాక్షికంగా కనిపిస్తుందని చెప్పారు.చంద్రగ్రహణం మధ్యాహ్నం 3.40 గంటలకు ప్రారంభమై రాత్రి 7.14 గంటలకు ముగుస్తుందన్నారు.ఇది హస్తా నక్షత్రం కన్యరాశి వారిపై ప్రభావం చూపిస్తుందని చంద్రశేఖర సిద్ధాంతి తెలిపారు.

 Full Moon Lunar Eclipse Effect On Chandrababu-TeluguStop.com

ఇక పాలకులకు గడ్డు పరిస్థితినే పొడచూపే గ్రహణం గా పేర్కొన్నారు .చంద్రబాబు జాతక రీత్యా పెక్కు చెడు ఫలితాలు ముసురు తున్నాయని పదవీ గండం తప్పేలా లేదని ఆయన తెలిపారు.గ్రహణ ప్రభావం ఆరు నెలలు పాటు ఏమాత్రం తగ్గుముఖం ఉండదని ఘడియ ఘడియకు పెరుగుతుందని దీని తీవ్ర ప్రభావం తగ్గించుకోవడానికి జాతక నిపుణుల సలహాలు వెంటనే బాబు తీసుకోవాలన్నారు.గ్రహణ కాలంలో నదీ తీరంలో స్నానమాచరిస్తూ వరుణ సూక్తులను పఠించాలనీ తెలిపారు.

ఈ వ్యాఖ్యలపై మరికొంతమంది సిద్ధాంతులు చంద్రశేఖర్ సిద్ధాంతి చెప్పినది పూర్తిగా కాదనలేము.కానీ అందులో వాస్తవాన్ని ఎదుర్కోవడానికి తగు యత్నాలు చేయాల్సి ఉంది అని వ్యాఖ్యానించారు .

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube