చంద్రబాబు జగన్ పై మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు

ఉన్నది ఉన్నట్టు ఎవరు ఏమనుకున్నా తాను చెప్పాల్సింది ఏదో ముక్కుసూటిగా కుండబద్దలుకొట్టినట్టు మాట్లాడే సినీ నటుడు మోహన్ బాబు మరోసారి ఏపీ ఎన్నికల్లో తమ పంచ్ డైలాగులతో హీటు పెంచే చర్యలు చేపట్టాడు.తాజాగా వైసీపీ లో చేరిన మోహన్ బాబు టీడీపీ అధినేత చంద్రబాబు మీద తనదైన స్టైల్లో విరుచుకుపడ్డాడు.

 Mohan Babu Shocking Comments On Chandrababu And Jagan-TeluguStop.com

తాను స్వచ్ఛందంగా వైసీపీలో చేరానని, తాను ఏ పదవీ ఆశించి మాత్రం పార్టీలో చేరలేదు అనే క్లారిటీ ఇచ్చాడు.పదవులు ఆశించే వాడినే అయి ఉంటే ముందే పార్టీలోకి చేరి ఉండేవాడినన్నారు.

జగన్ పార్టీ విజయం దాదాపు ఖాయం అయిపోయిందని, ప్రజలంతా జగన్ పాలన కోసం ఎదురుచూస్తున్నారని వ్యాఖ్యానించారు.

తాను పదవులకోసమే వైసీపీ లో చేరానని వస్తున్న వార్తల్లో నిజం లేదని, జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనే తెలుసుకుని ఏదైనా ఇస్తే తీసుకుంటాను ముందే ఫలానా పదవి తనకు కావాలని నేను డిమాండ్ చేయనన్నారు.

జగన్‌ తనకు బంధువని, కానీ బంధువనే పార్టీలోకి చేరలేదన్నారు.తెలుగు ప్రజలకు మంచి చేస్తారన్న ఉద్దేశంతోనే జగన్‌కు మద్దతు ఇస్తున్నట్టు చెప్పారు.లేఖలు రాసినా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం స్పందించకుండా ఇప్పుడు ఈ విమర్శలకు దిగుతోందన్నారు.

బాబు వద్ద కాకా పట్టేవారు చాలా మంది ఉన్నారని, వారు తమ నోటికి వచ్చింది ఏదో మాట్లాడుతున్నారని చెప్పుకొచ్చారు.వైసీపీలో చేరేందుకు మోహన్‌బాబు ప్రయత్నిస్తున్నారన్న టీడీపీ నేతల విమర్శల పై మోహన్‌బాబు సీరియస్‌గా స్పందించారు.తాను ఏ పార్టీలో చేరితే వాడికేమీ అని ఘాటుగా ప్రశ్నించారు.

పంచభూతాల సాక్షిగా తాను చెబుతున్నానని, తెలంగాణ ప్రభుత్వం ఏ ఒక్కరి మీద కూడా దాడి చేయడం లేదంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలనుద్దేశించి అన్నారు.చంద్రబాబు కూడా పార్టీలోకి రావాలని తనని ఆహ్వానించారని, నాకు ఇష్టం లేక వెళ్లలేదన్నారు.

ప్రారంభంలో చంద్రబాబు ఆస్తి ఎంత ? ఇప్పుడు ఆస్తి ఎంత అని ప్రశ్నించారు.చంద్రబాబు ఏమైనా పుచ్చలపల్లి సుందరయ్య అనుకుంటున్నాడా ? నాకు ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పేందుకు తాను సిద్ధంగా ఉన్నానని మరి బాబు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాడా అని సవాల్ విసిరాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube