సాహసం, ప్రయోగం అస్సలు వద్దంటున్న నాగార్జున.. సేఫ్‌ గేమ్‌ ప్లేయింగ్‌

అక్కినేని నాగార్జున వయసుకు తగ్గ పాత్రలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు.గత కొంత కాలంగా నాగార్జున సక్సెస్‌లకు ఆమడ దూరంలో ఉంటున్నాడు.

 Nagarjuna Safe Game Playing-TeluguStop.com

హీరోగా చేస్తున్న ప్రయత్నాలు ఫ్లాప్‌ అవుతున్న నేపథ్యంలో కాస్త చూసి సినిమాలను ఎంపిక చేయాలనే ఉద్దేశ్యంతో ‘మన్మధుడు 2’ చిత్రం కోసం దాదాపు ఆరు నెలల సమయం తీసుకున్నాడు.ఇదే సమయంలో కళ్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో ‘బంగార్రాజు’ చిత్రంకు ఓకే చెప్పాడు.

ఈ రెండు సినిమాల్లో కూడా నవ యువకుడిగా కాకుండా కాస్త ఏజ్‌ అయిన వ్యక్తిగా కనిపించబోతున్నాడు.

ప్రస్తుతం సినిమాకు సంబంధించిన నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

మన్మధుడు 2 చిత్రం ఇటీవలే ప్రారంభం అయ్యింది.ఈ చిత్రంను నాగార్జున నిర్మిస్తున్నాడు.

యంగ్‌ హీరోలు మరియు చిన్న హీరోలు కూడా బడ్జెట్‌ విషయంలో అస్సలు కాంప్రమైజ్‌ అవ్వడం లేదు.కాని నాగార్జున మాత్రం తన సినిమా బడ్జెట్‌ విషయాలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

ముందు నుండి అనుకున్నట్లుగా కాకుండా 30 కోట్ల బడ్జెట్‌తో కాకుండా 20 నుండి 22 కోట్ల బడ్జెట్‌తో సినిమాను తీయాలని నిర్ణయించారు.

నాగార్జున సినిమా 25 కోట్ల బడ్జెట్‌ వరకు ఈజీగానే రాబట్టగలదు.కాని అంతకు మించి పెడితే మాత్రం అప్పుడు ఖచ్చితంగా సినిమా సూపర్‌ హిట్‌ అవ్వాల్సి ఉంటుంది.ఒక వేళ సినిమా ఫలితం తేడా కొడితే మాత్రం బయ్యర్లకు తీవ్ర నష్టం జరుగుతుంది.

అందుకే నాగార్జున సాహసం చేయకుండా 20 కోట్లకు కాస్త అటు ఇటు బడ్జెట్‌తో సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడు.వయసు మీద పడ్డ ఈ సమయంలో నాగార్జున కాస్త ఓపికగా సినిమాలు చేయడం అనేది మంచి నిర్ణయమే.

అయితే క్వాలిటీ విషయంలో రాజీ పడితే మాత్రం మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది.అది గమనిస్తే మంచిది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube